నలుగురిని గెలిచినవాడు కాదు,
నాలుకని గెలిచినవాడు ధీరుడు...-
నలుగురిలో ఉన్నప్పుడు నాలుక..
ఒంటరిగా ఉన్నప్పుడు
ఆలోచనలు జాగ్రత్త..-
చేంతాడు ఎంత పొడుగ్గా ఉంటే
అంత మెలికలు పడుతుంది
నాలుక కూడా అంతే
ఎంత పెద్దగా ఉంటే అంత
మెలికలు తిరుగుతుంది
అందుకే చేంతాడును నాలుకను
మెలికలు పడకుండా జాగ్రత్తగా
చుట్టి అవసరము ఉన్నప్పుడే వాడాలి-
అప్పటి కత్తులకన్నా
ఇప్పటి నాలుకలకే
పదునెక్కువ
అప్పుడు
తలలు మాత్రమే తెగేవి
ఇప్పుడు
కుటుంబాలు
కుటుంబాలే తెగిపోతున్నాయ్-
ఆరడుగుల ఆజానుబాహుడిని
అరంగుళం నాలుక శాశించినట్టు
అర్ధ రూపాయికి తూగనోడు
అందరిపైన ఆజమాయిషీ చేస్తుంటడు-
సన్ననైనదేమో నాలుకనట
పలుకులేమో అనంతమట
పదునైనవేమో మాటలట
బంధాలనేమో తెంచేస్తవట-
"ఏడుస్తుంది స్వర్గం
అందరికి తననే కోరుకుంటారని
ఎంతమందికని తను ఆశ్రయం ఇవ్వగలదు?ఎన్నాళ్లు ఇవ్వగలదు?!"-
💞
"ప్రేమ"
మూతి కుట్టుకొంటే
మాటలు రావేమో ...
కొట్టుకొనే గుండె
కట్టుబడే ఉంటాది ...
మూసుకోని మనసు
బాసలు చేస్తుంటాది ...
మరువలేని మది
మారాం చేస్తుంటాది ...
మనిషి చేసిన "ప్రేమ"
మరణం లేదంటాది ...
నీ ఆఖరి
ఊపిరి వరకుంటాది ...
... ✍ "కృష్ణ" కలం
-