ముక్కూమొహం తెలీనివాడు చేసేది మోసం..
అదే మన అనుకునేవాడు చేసేది నమ్మకద్రోహం...
రెండింటికీ చాలా తేడా ఉంది...
వెన్నెల సతీష్...-
స్నేహం కోసం ప్రాణత్యాగాలే చేయాల్సిన అవసరం లేదు
నమ్మిన స్నేహానికి నమ్మకద్రోహం చేయకుండా ఉంటే చాలు-
ఎవరినో ఎందుకు నమ్మడం? అన్నీ తెలిసి
మన అనుకున్న వాళ్ళే మోసం చేస్తుంటే..!!-
నాకు ఓటములు, వెన్నుపోట్లు, నమ్మకద్రోహాలు కొత్తేమి కాదు. కాని, తిన్న ప్రతిదెబ్బ, గుణపాఠం తో కూడిన ఆత్మస్థైర్యంన్ని నింపి,
ముందడుగు వేసేలా చేస్తుంది.
#మారుతి నందన్-
నమ్మితే చేసేది మోసం..
నమ్మిస్తూ చేసేది నమ్మక ద్రోహం..
మొదటిది భవిష్యత్తుని హరిస్తే..
రెండవది జీవితాన్నే హరిస్తుంది.
...✍️వెన్నెల సీత
-
మనవాల్లేగా మౌనం
వహించక తప్పదు
ప్రేమించాంగా చివరి వరకూ
సహించక తప్పదు
బాధ్యతేగా గుండెలో
బరువు మోయక తప్పదు
నవ్వటం నేర్చుకోక పోతే
జీవితంలో జీవముండదు
-
తప్పుని క్షమించొచ్చు కానీ...
నమ్మకద్రోహాన్ని,
నమ్మించి చేసే మోసాన్ని కాదు.-
బయట వ్యక్తులు నమ్మక ద్రోహం చేస్తే
బాధపడి వదిలేస్తామేమో,కానీ
నా అనుకున్న ఇంట్లో మనిషి మోసం చేస్తే
నమ్మక ద్రోహం పదం సరిపోదేమో అంతకు మించిన పదం ఉపయోగించాలి.! బాధ అయితే వర్ణనాతీతం.
-BharathKummagoori-
బంతిని ఎంత బలంగా పైకి వేస్తే అంత
బలంగా కిందకు వచ్చి ఢీ కొడుతుంది.
అలాగే
ఎదుటివారిపై మీ నమ్మకం ఎంత బలంగా ఉంటుందో..
నమ్మక ద్రోహం కూడా అంతే బలంగా ఉంటుంది.
Be ready for Everything..
...✍️వెన్నెల సీత-