Maruthi-
ఎవరి మీద ఆధారపడను.
ఎవరి నుండి ఏమి ఆశించను.
నా ఆలోచనలు నాకే పరిమితం
నా కొసం మాత్రమే నేను బ్రతుకుతా.
చివరికి
నా సావు... నేను సత్తా....-
నాకు బ్రతకడమే గగనం అయినప్పుడు
నువ్వు అనుకునే ఏ స్థాయికైనా
నేను దిగజారడాని సిద్దంగా ఉన్నాను.
ఇక
మంచి చెడులు విశ్లేషణ అంటారా!
అది నీ వ్యక్తిగతబుర్రకే
వదిలేస్తున్నా...
#మారుతినందన్
-
నేనే... నా ప్రపంచం...
నేను ఎప్పుడు అంతం అవుతానో
అప్పుడే నా ప్రపంచం అంతం అవుతుంది
ఇక తిరిగి ఆ ప్రపంచాన్ని నాలా ఎవ్వరూ చూడలేరు..
#మారుతినందన్-
రాజ్యాంగేతర శక్తులు రాజ్యమేలుతున్నప్పుడు
రాజ్యంలో అసమానతలు పెల్లుబికినప్పుడు
సమర్ధవంతమైన పాలన కొనసాగడానికి,
రాజకీయ ప్రక్షాళన దిశగా అడుగులు వేయడానికి,
ప్రజసంక్షేమమే అంతిమ లక్ష్యంగా,
ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ట పరచడానికి,
ఒక నియంతలాంటి వ్యక్తిని, నియంతృత్వ
పాలనను, వ్యవస్థని నేను సమర్ధిస్తాను.
#maruthinandhan-