తన జ్ఞాపకాలెంతటి
మధురమంటే
మనసంతా
నిత్యం నిండు పున్నమే
-
మ:పరకాల
జిల్లా:వరంగల్(రూరల్)తెలంగాణ
క(ర)వి వెలుగుని
బంధించే ఏ బంధీకాన లేదు
ఎగిసిపడే అతని అక్షరాల చైతన్యానికి
ప్రతిరూపమే ఈ హరాక్షర
అభిమాన కెరటమిది మరి!
-
ಇವರ ಮಾತೃಭಾಷೆ ಕನ್ನಡ
ತೆಲುಗು ಭಾಷೆಯ ಬಗ್ಗೆ ಒಲವು
ಯಾವಾಗಲೂ ತಪಸ್ಸಿನಂತೆ ಕಲಿಯುವುದು
ಸುಂದರವಾದ ಗಜಲ್ಗಳನ್ನು ಬೀಸುತ್ತಿದೆ
ಅತ್ಯುತ್ತಮವಾಗಿ ಅಕ್ಷರ ಕೃಷಿ ಮಾಡುತ್ತಿರುವ ಗೆಳೆಯ
ಜನಾರ್ಧನ್ ಅವರಿಗೆ ಹುಟ್ಟು ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು
_ ಹರಾಕ್ಷರ 3074✍️-
కైతనొక్కటి గట్ట సహస్ర కవిమిత్ర, కళాత్మ బిరుదాంకితుడైనట్టి
ఆదర్శ కైతల,అభిమానంతో రవివర్మ గారిపై
కదలనంటూ మారం జేసే కలము మరి!.....
ఈ హరీషుని కవితా ప్రస్థానంకు పురుడోసి
హరాక్షరగా మార్చి పద్యశతక కర్తగా తీర్చిదిద్దినట్టి
అతని ఘనత దెలుప నా కలము తరము గాదే....!
-
అణా పైసనైనా సంపాదించని
గీ అచ్చరాల్ని గుండె నిండారా ఎత్తుకుని
కాగితపు దోసిట్ల ఒడ్సి వట్టి
పసిపిల్లోలే పదాలను ముద్దాడుకుంటా
నీతి పాఠాలు నేర్పే పుస్తకాలతో దోస్తీ జేసుకుంటా
బత్కు ఎతలను కలంతో కైతలుగట్టి
కదిలే కాలపు కచ్రానికి ముడుపుగడ్తున్నా!..
ఏ పేరు కోసమో, ఎవ్వని మెప్పుకోసమో,
ఎవ్వడి ఎంగిలి మెతుకులకు ఆశపడక
ఆకలికై తండ్లాడుతున్న పేగుల అరుపులతో
అచ్చర పోరుబాట బట్టి
పూటపూటకు ఆత్మ సంతృప్తి గంజి వార్చి
కడ్పు ఆఖలి పండుగను ఏళ్ళదీసుకుంటా వత్తాన్నా!....
-