నిష్కల్మష స్నేహమట
వారిరువురి మధ్యనట
అనుమానపు చీడపట్టి
ఆ బంధం వాడెనట-
అనుమానపు అలజడులు పుట్టుకు వస్తే
ప్రేమ అనేది ఎంతటి మహావృక్షంగా ఎదిగినా వ్రేళ్ళతో సహా ఒరిగిపోతుంది.-
ప్రేమ అనేది ఎంత గాఢంగా ఉంటే... అనుమానపు సెగలు ఎంత వేడిగా ఉన్నా....ప్రేమాభిమానపు మంచులలో సల్లబడవలసిందే,....
-
నీ మాటల తూటాలకు తట్టుకోగలను..
నీ క్రోధాన్ని భరించగలను..
నీ దూరాన్ని ఊహించగలను..
నీ నిర్లక్ష్యాన్ని అయినా ప్రేమించగలను..
కానీ నీ అనుమానాన్ని మాత్రం మరువలేను..
అనుమానం ఉన్నచోట క్షణం కూడా మనలేను నేస్తమా..
...✍️వెన్నెల సీత-
గెలుపుకి అభిమానం ఎక్కువ వద్దన్నా వస్తుంది
ఓటమికి అనుమానం ఎక్కువ ఎంత ఎదురు చూసినా ఓదార్చేందుకు ఎవరూ రారు
ఈ రెండింటికి మధ్యలో నువ్వు చేసే ప్రయత్నం చాలా గొప్పది అదే నీ మొదటి గెలుపు-
అనుమానం
నమ్మకానికి వ్యతిరేకం
ఇదో రోగం
మనసు లో నరకం
మనిషి లో శునకం
మనకి మనం దొరకం
వెతికేతనం, ప్రతిక్షణం
ఇది దీని లక్షణం
నమ్మకాన్ని అమ్మినా విలువ తగ్గదు
అమ్మితే పరువు దక్కదు
కలికాలం, అనుమాననికే అవకాశం-
చిన్న అనుమానం..
చిరునవ్వుని దూరం చేస్తుంది..
చింతను చేరువచేస్తుంది..
చిట్టి గుండెని చీల్చుతుంది..
బంధాలను చిన్నాభిన్నం చేస్తుంది..
అందుకే..,,
అనుమానం వద్దు..
అవగాహన ముద్దు.
...✍️వెన్నెల సీత-
అవమానించే అనుమానం ముందు
ఆరాధించే అభిమానం అసంతృప్తిగా మిగిలింది.-
ప్రేమ బంధంలో ద్వేషం ఎప్పటికైనా
ప్రేమగా మారుతుంది.
కానీ అనుమానం ఎప్పటికైనా
అసహ్యంగా మారుతుంది..
....✍️వెన్నెల సీత-