జెండా రంగు మారుతుంది కాని,
రాజకీయ నాయకులు కాదు.
నోటు రంగు మారుతుంది కాని,
దాన్ని దోచుకునేవాల్లు కాదు.
మతం మారుతుంది కాని,
దాని పేరుతో అన్యాయాలు చేసేవాల్లు కాదు.
మనిషి రంగు మరుతుంది కాని,
తన కష్టాలు మారవు.
ప్రాంతం మారుతుంది కాని,
సామాన్యుడి పరిస్థితులు మారవు.-
22 JUN 2018 AT 18:37
27 SEP 2021 AT 15:10
ధనవంతుల పాలనలో
సామాన్యుడుకి బతుకే బరువు
దోపిడీ రాజకీయాలలో
పేదోడికి న్యాయమే కరువు-
7 JUL 2020 AT 16:43
పాలకులు కాదు
పరిపాలన మారాలి
నాయకులు కాదు
ప్రజలు మారాలి
ప్రభుత్వలు కాదు
ప్రభుత్వ విధానాలు మారాలి
-
19 SEP 2021 AT 21:14
నాడు వాళ్ళ సామెత
అమ్మ కడుపు చూస్తది
పెళ్ళాం జేబు చూస్తది
నేడు నా సామెత
ఓటరు నోటు,కోటరు చూస్తడు
నాయకుడు ఓటు,పోటు చూస్తడు-
28 NOV 2021 AT 6:52
అగ్రకులాల ఆధిపత్యాలు
దళితకులాల దండయాత్రలు
ఇదే నండి నేటి అవినీతి రాజకీయం-
18 JUL 2020 AT 20:02
పగటి నిజాలం
ఇరుల మోసాలం
మృత్యువు వాకిట్లో
రంగుల ముసుగులం
పాలేరు కూలీలం
మాయజేయు పకీరులం
ప్రసంగాల పండితులం
వాగ్దానాల మోతలం-
7 JUL 2020 AT 21:16
పగ, ప్రతీకారాలే ధ్యేయం..
ప్రజా అభివృద్ధి శూన్యం..
ఇదే నేటి రాజకీయం...
-
11 JUL 2020 AT 8:13
అభిమానం...
ప్రశంసిస్తది..!
ప్రశ్నిస్తది..!
బానిసత్వం...
భజన మాత్రమే చేస్తది..!-