మనిషి కాదది
మహమ్మారి రోగమట
మాట వినుకుంటే మనిషి
మనుగడే మటుమాయమట
మనిషిని మనిషి కలువొద్దంటే
మారాజల్లే పోసు కొడుతుంటివి
మా వాడు మీ వాడు అనేదేం లేదిక్కడ
మహమ్మారి రోగానికి మనందరం ఒకటేనట
పండుగుందని పని ఉందని రోడ్లపై తిరుగుతుంటే
పాడెనెక్కి పోయేందుకు ప్రయత్నం చేస్తున్నమాటే
సర్వేజనాః సుఖినోభవంతుకి అర్థం ఏమిటంటే
శవాలను కూడా అనాధలుగా చేయకుండా ఉండడమట
అవును మరి,
ఆ మహమ్మారి మనిషిని ముద్దాడిందంటే
కడచూపును కూడా పొందలేక ఏడ్చి ఏడ్చి చస్తామంట.🤘
-