QUOTES ON #కాలం

#కాలం quotes

Trending | Latest
28 DEC 2018 AT 20:32

కాలమే బదులిస్తుందని కలకాలం కూర్చుంటే ఎలా?
లే.. మిత్రమా!
నువ్వు తలపెట్టి మరుగునపడ్డ కార్యాలెన్నోవేచి ఉన్నాయి..
లే..మిత్రమా!
నువ్వు నిర్ణయించు గమనాలకై కథలెన్నో వేచి ఉన్నాయి..
లే..
శంఖాలన్నీ కంకణం కట్టి,సజీవాలన్నీ సంకన పెట్టి
దేహాన్నే ఇందనంగా వేగాన్ని అధనంగా తట్టి
లేచిపడే సంద్రపు అలలా లే.... లేచి నీ ముద్ర వెయ్యి..

-


1 OCT 2020 AT 19:08

గతపు ద్వారానికి వ్రేలాడే
జ్ఞాపకాల తోరణాలు..
చెదిరిన చరితకు
చెరగని ఆభరణాలు..!!

-


12 APR 2021 AT 20:59

మనసెందుకో బరువెక్కిపోయింది
కలమెందుకో కదలలేనంటుంది
వెనుతిరిగి చూస్తే..
వేవేల జ్ఞాపకాలు.
ఆనందం పంచినవి కొన్నైతే,
బాధలను మిగిల్చినవికొన్ని.
కాలం, ఆగక పారే నది.
కానీ, జ్ఞాపకాలు ఆ నదిలో కదలక నిలిచే బండరాళ్లు.
ఆలోచనలకు కాలంతో సంబంధంలేదు
గతం గాలిలా పలకరించినప్పుడల్లా
వర్తమానం పువ్వులా పులకరిస్తూనేవుంటుంది..
జ్ఞాపకాన్ని మించిన మాయలేదు యీజగత్తులో,
మనిషిని లోతులకు లోబరచాలన్నా
యెత్తులకు ఎగరేయాలన్నా..!!

-


18 MAR 2021 AT 22:22

గడిచిన ఇన్ని వేల క్షణాలకూ వివరిస్తా
మరొక్కసారి నిన్ను చూడాలన్న
నా ఆరాటం విలువేంటో
నిన్ను చూసిన ఆ ఒక్క క్షణం విలువేంటో
ఇన్నాళ్ళు భరించిన వేదనెంతో
మనసుకి తగిలించిన బరువెంతో
నాలో లేని నేనేంటో
నీకై ఎదురుచూసే నేనేంటో

-


5 APR 2021 AT 15:12

కాలంతో కబుర్లు..!
[In caption]

-


10 APR 2018 AT 9:08

పని భారం ఆలోచనల్లో
పదాల భారం మనసులో...

వృత్తి కి చేకూరాలని న్యాయం
ప్రవృత్తికి చేస్తున్నా అన్యాయం ...

గమ్యం చేరే క్షణాలలో
కాలంతో పోటీ పడుతున్నా ..
గమనం కొనసాగిoచాలన్న ఊహలో
కలిసొచ్చే కాలంకై వేచున్నా.....

-


29 APR 2020 AT 5:33

కాలానికి కలం స్పందిస్తే కవిత్వం..
కలానికి కాలం స్పందిస్తే ఉద్యమం..!!

-


9 MAR 2019 AT 1:21

కనువిప్పనుకునే కాలం
కనువిప్పాలనుకునే నా కలం

-


23 JUN 2020 AT 20:28

మనోసంద్రంలో అలల ఘోషలు
అలజడులు సృష్టిస్తున్నా,
పెదాలపై నవ్వులనురగలను
చిందిస్తూనేఉన్న..!!

-


12 JUN 2020 AT 19:09

కాలం చేసిన గాయం
పదే పదే గుండెకు
కత్తులు దుస్తున్నా
చచ్చిన ఆశలకు
ఊపిరి పోస్తూ
బ్రతకలనే బలమైన
కోరికతో విజయం
కోసం పరితపిస్తున్న
క్షణాలని లెక్కపెడుతూ
బ్రతికేస్తున్నా

-