శతకోటి సైన్య సమాన రామ
అనంతకోటి సౌమ్య విధాన రామ
వైవిద్య గుణాభి రామ
వైదేహీ అంకిత రామ
(Full in captions)
-
సంద్రాలు ఈదేస్తా
స్వర్గాల్లో తేలేస్తా
కాలాన్ని కట్టేస్తా
గమనాన్ని చెరిపేస్తా
నువ్వు నావైతే..
-
పువ్వులకు పోటీ తన నవ్వులతోటీ
వెన్నెలకి పోటీ తన కన్నులతోటీ
ముగ్గులకి పోటీ తన పాలబుగ్గలతోటీ
అమ్మ కి సాటి నాన్నకి మేటి మా క్యూటీ
-
నేస్తమా నా మధురిమా...
స్నేహమై ఎదురైన పూర్ణిమా..
శ్వాసవై ఎదనిండిన ప్రేమమా...
పదాల వానతో ప్రతిపాదించనా.
జగాలు మరిపే ప్రేమందించనా
నేస్తమా నా మధురిమా...
స్నేహమై ఎదురైన పూర్ణిమా..
శ్వాసవై ఎదనిండిన ప్రేమమా..
ఏడేడు జన్మలకు ఏకంగా ప్రతిపాదించన..
ఈడంతా మరిచి ప్రేమందించనా
-
నీ రాకను తలిచి భాధను మరిచిన అమ్మకి బహుమతివా
నిను కానక మునుపే నీకై కవనము చేసిన నాన్నకి మధురిమవా
-
హృదయంలో ప్రేమకు
ఉదరంలో దాల్చిన రూపం
కనులెన్నని ప్రేమకు
కణకణములల్లి పోసిన ప్రాణం
కళ్ళల్లో ప్రేమకు
కనులముందు ఉద్భవించు జీవం
మనం అన్న భావనకు
మనిషి రూపమే ఈ జననం
-
కడలై కదిలే కధలలో
అలలై ఎగసే ఆశలతో
సాగించు జీవితాలే మనవి
జడులై కురిసే మేఘాలలో
ఉరుమై మెరిసే శోకాలతో
వర్షించు జాతకాలే మనవి
-
ఊహల ఊబిలో చిక్కిన మనసా
ఊసుల త్రాసులో హెచ్చిన సొగసా
విరహపు లోగిలిలో నలిగిన వయసా
కలహపు కౌగిలికై కలిగిన లాలసా
పరిణయ తరుణం రేగిన వాంఛ
రతిమయ సమయం తీరును బహుశా
-
జనన మరణాల నిర్ణయం నీదైనప్పుడు
నడుమ నలుగు జీవిత భారం నాపై ఎందుకు
చావు నాకు చెప్పి రానప్పుడు
నడుమనీ బంధాలతో నా మనసు బంధీ ఎందుకు
నీవు చెయ్యి చాచినప్పుడు చచ్చేటప్పుడు
నడుమ నాదీ ఊపిరని ఈ నా ఉబలాటమెందుకు
నిర్దాక్షణ్యంగా నువ్వేదోక్కనాడు హరిస్తావని తెలసినప్పుడు
నడుమ నా హృదయం నీ హరి నామ జపములో తేలియాడుతుందెదుకు
-
గుండెలో నువు గుచ్చినా
అక్కడే జనియించిన ప్రేమే మందై మాన్చునులే
నిప్పులో నువు కాల్చినా
అందులో జ్వలించిన భస్మమే నీ రూపం దిద్దునులే
నిలువునా నువు చిల్చినా
వెల్లువై చిందిన రక్తం నీ పేరై పారునులే
-