ప్రతి ఒక్కరికి బారసాల రోజు పరిచయమవుతావ్
బాల్యాన్ని అతి మధురంగా తీర్చిదిద్దుతావ్
నీ రెండు కొసలతో దూలానికి ముడిపడి సన్నగా
మొదలై అడుగు భాగాన చక్కగా వెడల్పుగా ఉంటావు
ఆ పైన సన్నగ్గా ఉన్న కొంగును పట్టుకొని ఊపుతూ
అమ్మ జోల పాడుతూ ఉంటే హాయిగా నిద్ర పట్టేలా చేస్తావ్
అమ్మ ఒడిలా వెచ్చగా ఉండకపోయినా,
అమ్మను హత్తుకున్న అనుభూతిని ఇస్తావు
ఎందుకు ఇవ్వవులే అమ్మ కట్టుకునే చీరవు కదా
మేము పెరిగేకొద్దీ మాకు వెదురుతో లేదా చెక్కతో
చేసిన వివిధ ఆకృతులతో దర్శనమిస్తావ్
చిన్న వాళ్ళను అయినా పెద్దవాళ్లను అయినా ఇట్టే ఆకట్టుకుంటావ్
ఓ నా ప్రియమైన ఉయ్యాల, నువ్వు ఒక వస్తువు కాదే ఒక ఎమోషన్ అంతే!-
నా ఎదలోని సుమధుర భావాలను వింటూ
నా మది ఊయలలో నిద్రపోయిన నీకు
ఈ ఉదయాన శుభోదయం పలుకుతూ
నిద్ర లేపుతున్నా...❤️❤️-
నీకు సంబంధించిన రకరకాల ఊహలు
నన్ను ఊయల ఊపుతున్నాయి.
నిద్ర పొమ్మని కాదు.
నీకు మరింత దగ్గరవ్వమని..☺️☺️😍-
ప్రకృతి ఒడిలో ఊగే ఊయల
ఆనందాల నిలయం ఊయల
ఆటు పోటుల ఊగే ఊయల
సంద్రపు అలలా కదిలే ఊయల
ఊహల పల్లకి ఊగే ఊయల
అంబరాన్ని అందే ఆశల ఊయల
నింగికి నేలకి తాకని ఊయల
వయస్సుల బేధం చూడని ఊయల
పిల్లల నేస్తం ఆగని ఊయల
పాటకి పల్లవి పాడే ఊయల
గజ్జెకు తాళం కలిపే ఊయల
హరివిల్లులా ఊగే ఊయల
అలుపే ఎరుగని ఆటే ఊయల...
౼స్వాతి కిరణ్...-
స్త్రీ కి ఎక్కువగా ఎమ్ ఇష్టమో తెలుసా..
ఒక్క చల్లని వేళలో
అందమైన వాతావరణములో...
సూర్యాస్తమయంలో...
అల్లా ఉయ్యాల ఊగుతూ ఉంటే
అబ్బా ఎమ్ హాయిగా ఉంటుందో..
😍💓
మాటల్లో చెప్పలేను..
ఆ మధురమైన అనుభూతి నీ....
ఆ జ్ఞాపకాలని....☺️-
నేను చంటిపాపగా...
అమ్మ కంటిపాపలా,
మమకారపు ఉయ్యాలలో
ఊగుతూ,
పసితనం అనే ఆనందంలో
ఊరకలువేస్తూ,
ప్రపంచానికి బోసినవ్వులతో
ఊరటకలిగిస్తూ,
ఎప్పుడు అమాయకకత్వంతో
పలకరిస్తూ,
ఏమి తెలియక హాయిగా
నిద్రిస్తూ...
సంతోషసాగరంలో మునిగితేలే నాకు......
హఠాత్తుగా నిద్ర నుంచి మెలుకువ
వచ్చి అది కల అని తెలిసింది...
--శర్మిష్ట
-
ఆహ చక్కని ఉయ్యాల.
ఆనందాల ఉయ్యాల.
బంగారు ఉయ్యాల.
చిన్నారి ఊగే ఉయ్యాల.
సంతోషాలను హరివిల్లురంగు ల నవ్వులు పంచే ఉయ్యాల.
విహారాన్ని తలిపించే ఉయ్యాల.
గాలిని బిగపట్టి హృదయాన్ని దోబూచులాడే ఉయ్యాల.
మనసున మంగళహారతి కాంతిని చూపే ఉయ్యాల.
ఆశల కోరికలను ఆమడ దూరంలో కూడా గుర్తు చెయ్యకుండా గగనవీధిలో అల్లరి అంతులో ని స్వేచ్చను పంచె ఉయ్యాల.
ఉయ్యాలొ ఉయ్యాలొ ..నా బాల్య స్మృతులను గుర్తు చేసే మనసు....ఉయ్యాల.
-
చెట్టు ఒక జ్ఞాపకం
చిన్ననాటి ఉయ్యాల ఊగడం గుర్తొచ్చినప్పుడు
చెట్టు ఒక వ్యాపకం
విత్తునాటి నువ్వు పెంచడం మొదలెట్టినప్పుడు
-
ఉయ్యాల
ఆ అనుబంధం ఏనాటిదో,
ఆ ఆనందం ఏపాటిదో,
చూడగానే మురిసిపోయింది
ఆ పసిప్రాణం మరి....
ఆ ముసి ముసి నవ్వులెందుకో అని,
జలిబిలిగా ఆ గాలి గిలిగింతలు పెడుతుందేమో మరి.
ఎంత ఎదిగిన తరగదు
ఆ అభిమానం,
బాల్యన్ని గుర్తుతెచ్చే హర్షపులయం.
ఆ ఆరాటం ఏంటో అని,
ఆ ఇంద్రధనుస్సే ఉయ్యాలగా మారిందేమో మరి.
ఆ నమ్మకం ఏంటో మరి,
ఆ స్వర్గమే కనిపిస్తుందనేమో,
లేదా ఆ ఆకాశానికి తీసుకుపోతుందనేమో.
ఆ అనుబంధం ఏనాటిదో
ఆ ఆనందం ఏపాటిదో....-
ఊయల ఊయల ఊయల ఊగిసలాటను తెలిపే ఊయల
కర్మలున్నంత వరకే కాయమను దేహము కదలిక నిజమంట
|| ఊయల ఊయల ఊయల ||-