తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలతో
తెలుగు తల్లికి అక్షర నైవేద్యం
-
"మన జండా"
భారతావని భవ్య కీర్తికి నిదర్శనం
గర్వంగా నింగికెగసిన నా దేశ కేతనం
సత్య ధర్మ శాంతి సహనాల కాలవాలమై
ధర్మపథమే మార్గమని నమ్మిన జండా
ఖండాంతరాలకు ధార్మిక అధ్యాత్మిక దీప్తి
యుగ యుగాల సంస్కృతుల మహోదధి
అశోకుని ధర్మచక్రమే జాతి కీర్తిగ మెరిసే
అంబరాన వెలిగేటి దివ్యదీపం నా జండా
జాతిపిత బాపూజీ త్యాగాల స్వాతంత్ర్య ఫలం
భారత జాతి గర్వించే రీతిన తయారుచేసేను మన
ఆంధ్ర జాతి గౌరవం , కీర్తి కిరీటం పింగళి వెంకయ్య
మువ్వన్నెల మనజండా కిది శత వత్సర నీరాజనం
ఎగరాలి ఎగరాలి మన భారతావని కీర్తి పతాక
జగతి నిండుగ స్వేచ్చా వాయువులను నింపగ
నా దేశపు జండా కాకూడదది అవినీతికి అండ
ప్రగతి గతికి అండ మన జెండా
జగతి వెలుగులు అందించే కేతనం
ఎగరాలి ఎగరాలి విశ్వవినీలాకసంలో
విశ్వానికే వెలుగు దివ్వెగా
జైహింద్ జై భారత్ జై జవాన్-
నాన్నంటే
నాన్నంటే,
ఒక పిలుపు, ఒక వరస
ఒక పేరు మాత్రమే కాదు!
ఒక అనుభూతి
ఒక మధురస్మృతి
ఘనజీవనగతి!
నీవు నేనని వేరు కాదు
అన్నీ తానవడమే నాన్న!
-
భారతావని చరిత నా కవిత
రేపటి పౌరుల భవిత నా కవిత
మాతృత్వపు వనిత నా కవిత
ప్రేమానురాగాల మమత నా కవిత
పదవిన్యాసాల పులకింత నా కవిత
పరువాల పాలపుంత నా కవిత
ధర్మాధర్మాముల ఏరివేత నా కవిత
నవరసాల మాధుర్యమంత నా కవిత
హాస్యానికి చక్కిలిగింత నా కవిత
పౌరుషాల పాండిత్యమంత నా కవిత
నా ఊహల రూపమంత నా కవిత
సాటి కవులకు కలవరింత నా కవిత
ఏ నాటికైనా తెలియాలి లోకమంత నా కవిత
ఎనలేని ఖ్యాతి పొందిన నా దేశ ఘణత"నా కవిత"...
౼స్వాతి కిరణ్...-
నమస్కారం ప్రేమ ,నమస్కారం క్రమశిక్షణ, నమస్కారం చల్లదనం
నమస్కారం ఆత్మీయత నింపుతుంది ,స్నేహ మాధుర్యాన్ని చూపుతుంది
నమస్కారం చల్లదనాన్ని ఇస్తుంది , గౌరవాన్ని నేర్పుతుంది
నమస్కారం నుంచి మంచి ఆలోచనలు వస్తాయి
నమస్కారం కోపాగ్ని తొలగిస్తుంది, అహాన్ని నాశనం చేస్తుంది
నమస్కారం. సంస్కారాన్ని ఇస్తుంది,మన సంస్కృతిని రక్షిస్తుంది
అందుకే నమస్కారానికి నమస్కరిద్దాం,
మనల్ని మనమేగౌరవించు కుందాం
అందరికి హృదయపూర్వక నమస్కారములు
శుభోదయం-
ప్రకృతి నాశ్రయించి
బ్రతుకుట ధర్మమ్ము
ప్రకృతి నాక్రమింప
రాదు మనము
ప్రకృతి వికృతి యైన
ప్రళయమ్ము తథ్యమ్ము
ప్రకృతి తల్లి, మరువ
రాదు నిజము.
-
ఆహా!అందరికీ ఆహారోదయం..
ఊదుకు తినే ఉ(ప్మా)పాహారం ఉందొకటి..ఉఫ్..ఉఫ్..ఉప్మా ..అందిస్తా ఆరగించండి..ఈ ఓగిరం..వేగిరం..😋😋😋😋-