అయ్యోరామా..
ఈ మమ్మీలు ఏంటయ్యా
అమ్మాయిలు మంచిగా ఉన్న బడికి
తొలమంటే
ఆయమ్మలు మంచిగా ఉన్న బడికి
తోలుతున్నరు
-
రామ రామా
ఏంటయ్య సామి
ఇన్ని రోజుల నుండి బడికి పోతున్నా
ఒక్క అక్షరం ముక్క కూడా రాట్లేదు
అక్షరమంటే రాకుంటమాయే
ఒక్క అమ్మాయి అన్న పడొద్దా
పాపం పాడుగాను
🤦♂️🤦♂️😜😜-
చల్లగాలిలాంటి నీ చూపులతో చంపకే
మల్లె పువ్వులాంటి మనసుతో మాయచేయకే
చుక్కలో చక్కని చంద్రవంక
మబ్బుల్లో దాగున్న ముత్యపు చినుక
ఇడొచ్చిన హరివిల్లులా
వయ్యారన్నే వలపకే
కోతకోచ్చిన వరిసేనుల
సింగారం సూపకే
పాలకంకి పలుకులు పలికే పిల్ల
ప్రాణమంత నీ పై గాదే మల్ల
పండువెలుగుల నవ్వులు నవ్వకే పిల్ల
నా మనసంతా నీ పై పడతాదే మల్ల
ఓ పిల్ల ముద్దులే మురిపాల గోల
హద్దులే లేవంటూ ఆగదే ఏలా
అట్ట చూడకే ఓ వయ్యారి పిల్ల
ఆగమాగం అయితుందే నా గుండెల్లా
—✍️శ్రీజసుంకరి
-
మెరుపులా మెరుస్తూ ఆకట్టుకుంటుంది
అమ్మవారితో పోల్చబడుతుంటుంది
ప్రతి ఒక్కరిని మైమరపిస్తూ ఆకర్షిస్తుంది
దురాశతో చూస్తే మన పతనం మొదలవుతుంది
చాలా అపురూపంగా అందరిచే చూడబడుతుంది
అరుణోదయపు సూర్యుడిలా మురిపిస్తూ ఉంటుంది
ఆకసంలో చుక్కల్లా మెరిసిపోతూ అద్భుతంగా ఉంటుంది
వన్నెలతో మిలమిల మెరుస్తూ చందమామకే పోటీ ఇస్తుంది
// బంగారం(అమ్మాయి) //-
మేఘం విడిచి
వడిగా నడిచి
చినుకై చేరి
వరదై పారి
నేలంతా ఉరికెను ఈ నీరు.......
బంధువల్లే మారి
పుట్టినూరు చేరి
కలియతిరిగి ఇల్లంతా
తడిమిచూసె గతమంతా
ఆడపిల్ల తీరు
-
అమ్మాయి కోయిల స్వరం
అమ్మాయి చిలక పలుకులు
అమ్మాయి అనురాగపు
అమ్మ చూపు
అమ్మాయి పసిపాప లేత
మందార బుగ్గలు
అమ్మాయి ముద్దయిన
అమాయక సిగ్గు🐦
అమ్మాయి పసిపిల్ల చిరునవ్వు
అమ్మాయి మయూరి💛పులకింత
అమ్మాయి హంస నడక
అమ్మాయి
సొగసైన దేవత రూపంను
మించిన
ఆహ్లాదం అనురాగం
ఆరోగ్యం అనుబంధం
ఆనందం ప్రేమ
వలపు ప్రణయం పారవశ్యం
తన్మయత్వం స్వర్గామృతం
దైవత్వం💛
ఈ సృష్టిలోనే లేదు-
కురుల నాట్యం..
ప్రణయ పరిమళం
నయనాల సౌందర్యం...
హృదయానికి పరిణయం
నాసిక నయగారం...
ఆమని కవిత్వం
చెక్కిళ్ళ కావ్యం ...
వెన్నెల వయ్యారం
అధరాల సాహిత్యం...🕊️🕊️
పెదాలకు అమృతం
ఈ చామంతి చూపులకు💛
నా అణువణువు పరవశం
ఈ మోము సొగసుకు
నా తనువు తన్మయత్వం
ఈ వదన వైభవం
నా మనసు మంత్రముగ్ధం🥰-
అమ్మాయి పుడితే, ఈ సమాజపు మృగాల నుండి ఎలా కాపాడాలా అని
అదే భయం
అబ్బాయి పుట్టినా, ఈ సమాజపు దుష్టశక్తుల నుంచి ఎలా కాపాడుకోవాలి అని
ఘోరాలు జరగడానికి కారణం సమాజపు ధోరణి
ఇలా జరుగుతున్నాయి అని
అమ్మాయిలకు, అబ్బాయిలకు చెప్పే కన్నా
అమ్మాయే తల్లి, భార్య, కూతురు, స్నేహితురాలిగా
అబ్బాయే తండ్రి, భర్త, కొడుకు, స్నేహితుడై మన జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తారని చెప్పి
ఒకరినొకరు గౌరవించుకునేలా చేస్తే
ఇలాంటివి ఒకప్పుడు జరిగాయి అని కూడా ఎవరూ గుర్తుంచుకోరు.-
స్త్రీ
పురుషుని చేత ప్రేమించబడాలి
పురుషుడు
స్త్రీని ప్రేమించాలి
పురుషునికి ప్రేమ ఇవ్వడంలో
ఆనందం కలగాలి
స్త్రీకి ప్రేమ పొందడంలో
ఆనందం కలగాలి
అమ్మాయి నన్ను ప్రేమించడం కన్న
నేను అమ్మాయిని ప్రేమించడం
ఆరాధించడం
నాకు ఎక్కువ ఆనందం
నా ప్రేమ ఆరాధనకు
అమ్మాయి ఆనందం పొంది
తిరిగి నన్ను దీవిస్తే చాలు
ప్రేమించకపోయినా పర్లేదు
అమ్మాయి నా ప్రేమ అంగీకరిస్తే
నన్ను ప్రేమించినట్టే-