పువ్వులలో మకరంద అందం కోసం
వచ్చి పోయేవి తేనెటీగలు సీతాకోకచిలుకలు
పువ్వులోని అనురాగ అందం చూసి
బంధం కోసం వచ్చేవి
సూర్యకిరణాలు వర్షపు చినుకులు
— % &అలాగే స్త్రీలోని ముఖారవిందంలో
రూపంలో అనురాగ అందాన్ని చూసి
భావోద్వేగంతో బంధం కోసం ఆరాధించేవారు
పురుషులు అది పురుషతత్త్వం
కేవలం స్త్రీ తనువులోని మకరంద అందం కోసం
వచ్చేవారు మగవారు అది మగతత్వం
అనురాగ అందంలో మకరందం కూడా ఉంటుంది
కానీ మకరంద అందంలో అనురాగం ఉండదు
కేవలం కామం కోరిక ఉంటుంది
అనురాగ అందంలో ఉండే మకరందం
ప్రేమామృతం💛
— % &అనురాగ అందం
అనేది స్త్రీతత్వానికి ప్రేమతత్వానికి
చిన్నపిల్లతత్వానికి దేవతతత్వానికి
ఆరాధన భావోద్వేగాలకు అనుబంధానికి
అమృతానికి సంబంధించినది
మకరంద అందం అనేది ఆడతనానికి
తనువులోని అందానికి ఆకర్షణకు
కామానికి సుఖానికి సంబంధించినది— % &-
#కౌముది కవిత ఛాలెంజ్ లో నన్ను విజేతగా ప్రకటించిన పవన్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ
ఈ రోజు నా ఛాలెంజ్ ఏమంటే #అనురాగం మీద కవితలు రాయగలరు ఎన్ని పాదాలయనా రాయవచ్చును.శనివారం సాయంత్రం వరకు గడువు. #అనురాగం #నాఛాలెంజ్ హాష్ టాగ్ లను ఉపయోగించగలరు. అందరికీ ధన్యవాదాలు.
మీ సుమనప్రణవ్
-
అనురాగం ఆప్యాయతలు అనుబంధాలు
మచ్చుకైనా కనిపించని మానవ సంబంధాలు
అన్నదమ్ముల మధ్య ఆలుమొగల మద్య
అత్తాకొడళ్ల మధ్య మామా అల్లుళ్ల మద్య
తండ్రీ కొడుకుల మధ్య తల్లీ కూతుర్ల మద్య
మచ్చుకైనా కనిపించడము లేదు అనురాగాలు ఆప్యాయతలు
పెద్ద దిక్కు లేని సంసారాలు
పెళ్లి అవ్వగానే వేరు కాపురాలు
ప్రతీ చిన్న విషయాలకే కోప తాపాలు
అవి పెరిగినవంటే ఇక కాపురాలు వీధి పాలు
ఇంకెక్కడి అనురాగాలు ఆప్యాయతలు అనుబంధాలు పక్కింటోడు ఎదుగుతున్నాడంటే ఓర్వలేనితనం
ఎదురింటోళ్లు సల్లగా ఉంటే కళ్ళల్లో నిప్పులకారం
చుట్టాలు ఇంటికి వస్తే చీదరింపులు
ఉమ్మడి కుటుంబాల ఊసే లేదు
ఇంకెక్కడి అనురాగాలు ఆప్యాయతలు అనుబంధాలు
కలికాలం దాపురించే వావి వరుసలు మర్చిపాయె
సీరియల్ పిచ్చి ముదిరి పాయె
పక్కనే ఉన్నా పట్టించుకోరు సెల్లు ఫొన్ల ముచ్చట్లు ఒడిసిపోవు
కృత్రిమ స్నేహాలు కృత్రిమ ప్రేమలు
ఇంకెక్కడి అనురాగాలు ఆప్యాయతలు అనుబంధాలు-
నీవే నాకు వర్ణం
నీవే నాకు సువర్ణం
నీవే నాకు ఆభరణం
నీవే నాకు ఆనందం
నీవే నాకు అనురాగం
నీవే నాకు అనుబంధం
నీవే నాకు అమృతం
నీవే నాకు
💛అద్భుతం💛-
పన్నీరుకు చక్కర నెయ్యి ఇలాచి
కలిపితే కలకండ్ స్వీట్ అవుతుంది
కన్నీటికీ ఓదార్పు ప్రేమ అనురాగం
కలిపితే స్వీట్ ప్రేమ బంధం అవుతుంది-
అమ్మ!
నీ అనురాగం ఎంత గొప్పదో! నాకు మాత్రమే తెలుసు!
నీకు ఎవరి మీద
కోపం వచ్చినా
నేనే కనపడతా!
నీ చేత తిన్న తిట్లు
నాకు అట్లులా
నీ చేతి ఆయుధం
నాకు వజ్రాయుధంలా!
నీ లాలన
నాకు లాలిపాప్ లా!
నీ కరుణ
నా జేబుకు కనకవర్షమై!
నీ ఆత్మీయత అణువంత వచ్చినా
నాకు అణుబాంబులా అగుపడుతోంది!
అమ్మ!
నీ అనురాగం ఎంత గొప్పదో! నాకు మాత్రమే తెలుసు!
-
నీ గాత్రం విన్న తరుణం
మదిలో కోటి వీణల స్వరసంగమం
సూర్యోదయ అస్తమాల సుందర సమాగమం-
మంచి బంధం
గొప్ప బంధం అనుబంధం అని
ప్రత్యేకంగా ఏమి ఉండవు
అలా అనుకుంటే అన్ని బంధాలు
గొప్ప అనుబంధాలే
ఇరువురు ఒకరికొకరు పరస్పరం
ఏ బంధాన్ని అనుబంధాన్ని అనురాగంతో
అత్యంత గౌరవిస్తే అత్యంత ఇష్టపడితే
ఆ బంధాలు అన్ని గొప్ప బంధాలే
ఆ ఇరువురి దృష్టిలో...-
ఇష్టమైన వారి నుండి ఇష్టంగా కోరుకునే ఇష్టాలు...
ఆకాశమంత ప్రేమించకపోయినా...
అనువంత అనురాగం పంచిన చాలు...
రోజంతా దగ్గర ఉండకపోయినా...
ఉన్న నిమిషమైన నవ్వుతూ ఉంటే చాలు...-
# అనురాగం ఛాలెంజ్ లో పాల్గొన్న
మీ అందరికి నా ధన్యవాదాలు.
#అనురాగం లో ఛాలెంజ్ లో ప్రతి ఒక్క కవితా చాలా బాగుంది.అందరూ చాలా బాగా రాశారు. కానీ ఒకరినే విజేతగా ప్రకటించాలి కావున దాసరి లక్ష్మణ్ అన్నగారిని విజేతగా ప్రకటించడమైనది.మీరు తదుపరి ఛాలెంజ్ ఇవ్వవలసినదిగా కోరడమైనది.
-