QUOTES ON #TELUGUVELUGUTELUGUVELUGU

#teluguveluguteluguvelugu quotes

Trending | Latest
7 AUG 2019 AT 22:37

స్థిమితపడనీయని గుండె దడ
అనుమానాస్పద స్థితిలో ఊపిరి
ప్రమాణమెరుగని గుబులు ముట్టడి
తాళలేని మదికి తెలిసిందొకటే కంటతడి

-


24 OCT 2018 AT 10:31

మిత్రులందరికీ శుభోదయం ..
నా రాతలు సందర్భానుసారంగా కొన్ని,
అన్ని సందర్భాలకు అక్కరొచ్చేవి ఇంకొన్ని ...కానీ
నేను రాసే అక్షరాలే చూస్తున్నారా ,భావాన్నీ మనసారా అవగతం చేసుకుంటున్నారా అనే సందేహం ఉండేది ..నిన్న నా పుట్టినరోజు కానుకగా మిత్రులు తమ రచనల్లో రాసిన విధం ,మిగతా మిత్రులు వాఖ్యానాల్లో స్పందించిన విధానం చూసాక నా సందేహం తీరింది.
మనసుకి చాలా సంతృప్తిగా ఉంది..
నా గమనంలో మీ కవితల్లో నేనొక కవితగా మిగలడం ఆనందదాయకం ..

-


6 AUG 2018 AT 20:29

పువ్వు వికసించడం
కోయిల కూయడం
వంటివి వాటి సహజ లక్షణాలు ....
నీకోసమే అని సంబర పడటం మూర్ఖత్వం ..

-


29 SEP 2018 AT 15:51

ఆలి అనే అధికారంతో
ఆడదాన్ని కదా ఏం చేసినా, మాట్లాడినా చెల్లుతుందనే అహంకారంతో
అర్థాంగిగా, అమ్మగా ఏమాత్రం పనికిరాని మగువల్లారా ...
మీ ఆటలకు స్వస్తి పలికేందుకు
మీ భర్తల బతుకుల్లో వెలుగు నిండేందుకు
మీ వల్ల బురద చల్లబడిన పర స్త్రీకి అంటిన మలినాన్ని కడిగేందుకు
చాలా ఆలస్యమైనా
చారిత్రాత్మక మార్పులు వస్తున్నాయి ..
ఇకనైనా మీ అహంకార తెరలు
అమ్మగారింటి గడపలు
వదిలి,
మీ భర్తతో భార్యగా నడుచుకోండి
వెళ్ళి మీ బట్టలు సర్దుకోండి....

-


19 NOV 2019 AT 21:53

అకాల బంధువు వంటిది
చెప్పి రాదు
వస్తే వదలదు

-


14 MAY 2019 AT 13:38

మోముది ఏముందోయి,
మనసు చూడవోయి,
బ్రతుకు సుఖమునోయి,
ఓ కూనలమ్మ... !

-


10 FEB 2023 AT 0:29

సూటిపోటి మాటలతో నిన్ను వేధిస్తారు
నువ్వు శవమయ్యాక తెగ రోధిస్తారు / ఆనందిస్తారు

ఎవరంటావా?

నీ చుట్టూ ఉన్న నరరూప రాక్షసులు / భక్షకులు.🤘

-


14 NOV 2018 AT 22:04

కలం కావ్యని లికిస్తే
కాలం అర్ధని చెప్పెనే

-


25 JUL 2018 AT 2:27

ఇది నా మైమరుపో లేక నీ మెరుపో తెలియట్లేదు.

-