బొడ్డు హారిక   (కోమలి [బొడ్డు హారిక])
532 Followers · 554 Following

read more
Joined 26 February 2018


read more
Joined 26 February 2018

జీవితం అంటే ఒక్క క్షణం
హరివిల్లు గా ఆనందాన్ని ఇస్తుంది
మరు క్షణం హరి వేసిన విల్లుగా
ఆశృవులతో అడుగులు వేస్తూనే
చక్షువులతో చెలిమిని పెంచుతుంది
మనసును మౌనంతో మూసేస్తుంది

-



నిన్నటి చీకటిని వదిలేద్దాం
మనసును మిన్నుగా మార్చేద్దాం
వదనమును వెన్నెలగా మలిచేద్దాం
చక్షువులను చంద్రుడిలా చేసేద్దాం
అక్షువులతో అందమైన అక్షరాలను పలికేద్దాం
పదాలను కవనముగా కరముతో సృష్టిద్దాం

-



పాదాలను కదుపుతూ
మౌనంలో మాట కలుపుతూ
ప్రేమను ప్రాణంగా మలచుతూ
జీవితాన్ని పంచడమే కదా నా ఆయువు ఆకాంక్ష

-



ప్రతి క్షణం నన్ను కావలి కాస్తూ
ఒక్క క్షణం స్నేహితుడిగా సహాయం చేస్తూ
మరు క్షణం నాన్నగా లాలిస్తూ
తృటి తృటిలో నాపై తపన చూపిస్తూ
మూడు ముడులను జన్మ జన్మలకు ఆధారం చేస్తూ
ఏడడుగులతో ముళ్ళోకాలను చుట్టి చూపిస్తూ
నా మదిలో నిలిచిపోయిన శ్రీవారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీ ధర్మపత్ని శ్రీవిద్యా

-



ప్రతి క్షణం నన్ను కావలి కాస్తూ
ఒక్క క్షణం స్నేహితుడిగా సహాయం చేస్తూ
మరు క్షణం నాన్నగా లాలిస్తూ
తృటి తృటిలో నాపై తపన చూపిస్తూ
మూడు ముడులను జన్మ జన్మలకు ఆధారం చేస్తూ
ఏడడుగులతో ముళ్ళోకాలను చుట్టి చూపిస్తూ
నా మదిలో నిలిచిపోయిన శ్రీవారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీ ధర్మపత్ని హారిక

-



స్నేహితులను సన్నిహితులుగా మారుస్తూ
సంతోషాలకు వారధి గా మారేది

-



లేనే లేను
నాలో నేను లేనే లేను
ఎప్పుడో నీవై పోయాను
నా ఊపిరి సైతం నీ ఊహల ఊయలలో ఉంచాను
నీ ఎడబాటు నా బొందిని మన్నులో ఉంచడమే కదా ఓ ప్రియతమా...!
నీ ఒడిలో నా ఆయువు అగిపోవడమే కదా
నా చిరకాల వాంఛ.....!

-



కడుపు నింపుతూ
బాసలతో మదిని మదన పెడుతూ
నిత్యం చంచలాక్షి చక్షువులను
చెమ్మగిల్లేలా చేస్తూ
ఉంటే
మృగాక్షి మనసు తెలుపలేని క్షణమున
తృటిలోనైనా తరుని జీవనం నరక ప్రాయముగా మారెను కదా......
ఇదే కదా
పృథ్విపై ప్రతి పడతి హృదిలోని భావన.....

-



పృథ్వి పై వెలుగు వెలసిపోయి
చీకటి చిందులేస్తుంది
అయిననూ
అలసిన బ్రతుకులు
సేదతీరేలా చేస్తుంది
కానీ
నీ ప్రేమ దూరమైన క్షణం
నా జీవితంలో ప్రతి క్షణం
సూర్యాస్తమయమే కదా.....
నీవు నా చెంతనున్న తృటి అయిననూ
నా జీవితంలో ఉషోదయపు వెలుగును
నింపేను కదా......

-



ఆశలకు ఆయువు పోస్తూ
గమ్యాన్ని గుమ్మం ముందుకు తెస్తూ
ఏ ఎల్లలు లేక జీవితాన్ని జ్యోతిగా వెలిగిస్తూ
ఉండడమే కదా .....
సరస్వతి సొత్తు

-


Fetching బొడ్డు హారిక Quotes