నది కొంగును లాగుతూనే ఉన్నాడు సముద్రుడు,
మహాసాధ్వీమణి అని మరిచాడో ఏమో..?-
మనోసంద్రంలో అలల ఘోషలు
అలజడులు సృష్టిస్తున్నా,
పెదాలపై నవ్వులనురగలను
చిందిస్తూనేఉన్న..!!
-
రగులుతున్న భీకర అగ్నిపర్వతాలను
గుండెలోతుల్లో దాచుకుని
పైకి ప్రశాంతంగా కనిపిస్తున్న సముద్రాన్ని నేను..!!-
ప్రేమను నదిలాగే ఉండనివ్వండి,
అతి చేసి సముద్రాన్ని చేయకండి.
అందరూ ఈదలేరు!
అందులో మీరూ ఈదలేరు!!-
అల సంద్రం తీరం దాటి
నను తాకే క్షణం కోసం హైరానా పడుతుంటే
మది సంద్రం విహంగమై ఉప్పొంగి
తుళ్ళుతూ చిలిపి అల్లర్లేవో చేస్తుంది.
నాకై మురిసిన ఈ క్షణాలు
తుంటరిగా నను కవ్వించే సంకీర్తనలు
మింటిని తాకే ఈ సంద్ర గానాలు
నను మైమరిపించే మనసు తాళాలు..-
చుక్కల్లో చుక్కననుకున్నా
తోకచుక్కనై రాలతాననుకోలేదు.
మేఘాల్లో మెరిసిపోతున్నాననుకున్నా
వర్షపు చినుకులా రాలిపోతాననుకోలేదు.
మహా నదుల్లో రాణిననుకున్నా
సముద్రంలో కలిసిపోతాననుకోలేదు.
మనుషుల్లో మహారాజుననుకున్నా
మట్టిలోకి వెళ్తానని మరిచిపోతున్నాను.🤘-
మదిన అలజడి రేపుతూనే ఉన్నాడు సముద్రుడు
ప్రశాంతంగా సాగే నదినని మరిచాడో ఏమో..!-