QUOTES ON #వీరవనిత

#వీరవనిత quotes

Trending | Latest
7 AUG 2019 AT 20:32

కోటి హృదయాలను కదిలించిన గళం
మూగబోయింది..!
లక్షల లతలను హత్తుకున్న మాను నేలకొరిగింది..!

మానవత్వం నేడు మంటల్లో కాలబోతోంది..
మంచితనం బూదికుప్పను ఆశ్రయమడుగుతుంది..

రాజసింహాసనం దీనంగా చూస్తోంది..
ఎందరికో శ్వాసలను ప్రసరించిన ఆ మధురమంజులభాష ఏదని..?
ఈ దేశం బాధతో కన్నీరు కారుస్తోంది..
తన వేషానికి సొబగులద్దిన ఆ ఉవిద ఇక లేదని..?

జరిగింది నిజమా..
ఒరిగింది దిగ్గజమా..
మదికీ మతికీ రణమా..
వీర వనితకు మరణమా..!!

-


7 AUG 2019 AT 21:10

మాటల తూటాలతో తిరుగులేని సమాధానం ఇచ్చినా
ఆపదలో ఎవరు ఉన్నా సహాయానికి సిద్ధం అని చెప్పినా
నిండు కట్టుబొట్టుతో మన సంస్కారాన్ని చాటి చెప్పినా
ప్రజా సేవే లక్ష్యంగా చిన్న వయసు నుంచే పోరాడినా
తెలివితేటలతో గొప్ప వక్తగా చరిత్రలో నిలిచిపోయినా
ఎందరో యువతకు రాజకీయంలో స్పూర్తిగా నిలిచినా
అది మీకు మాత్రమే సాధ్యం అవుతుంది.

నేడు మీరు మా ముందు లేకపోయినా
మీరు మహిళల హక్కులకై పోరాడిన తీరు
ఎంతో మంది గుండెల్లో నింపిన ఆత్మవిశ్వాసం
మా మనస్సులో మీ స్థానం లాగే
ఎప్పటికీ నిలిచిపోతాయి

వీర వనిత!
మన భారతీయులమంతా గర్వంగా
చెప్పుకునే మన ప్రియతమ మహిళ
సుష్మా స్వరాజ్ గారికి ఇదే నా అక్షర నివాళి

- Sai Thanmae

-


3 JUL 2021 AT 20:37

అలా తను రయ్యిమని దూసుకుపోతుంటే
కత్తిచేతబట్టి గుర్రమెక్కి యుద్దానికి దూసుకెళ్ళే
వీరనారేనేమో అనిపించింది నాకు...
గాలికి ఎగసిపడే కురులూ, ఆ వేగం
మహా మహా రాణులనే తలపించింది...
సాగిపో సత్యభామా సాగిపో...
వెన్నెల సతీష్...

-


7 AUG 2019 AT 14:37

నివాళి ఘన నివాళి💐💐

-


7 AUG 2019 AT 16:09

We Lost Another Precious
Gem Of India.

May She Rest in Peace.
1952 - 2019

-


7 AUG 2019 AT 23:10

బిజెపి సోదరి సుగణాల రాశి భరతవాసి
చట్టాన్ని సవరిస్తు సమైక్యత పాటిస్తూ
అవధులు దాటి అభయ హస్తమందిస్తు
పొరుగు దేశాలతో నమన్వయం పాటిస్తూ
విశ్వవిఖ్యాతి గడించి దేశమాత సేవలో
తరించిన ధృవతార సుష్మకు అశ్రునివాళి

-


7 AUG 2019 AT 13:14

Great Daughter
Great student leader🙋‍♀️
Great youngest Minister
Great party worker
Great foreign minister
Great parliamentarian
Great Orator🧘‍♀️
Great fighter
Great survivor
Great patriot
Great friend
Great wife
Great mother
Great human being 🙏
Rest in peace The Great legend"Sushma ji"

-


29 MAR 2022 AT 13:01

కనులకు నీళ్ళు ఇచ్చె
కాలికి గుచ్చుకున్న ముల్లు

హృదయానికి నిప్పు పెట్టె
మదిని కాల్చుతున్న భావం

ముల్లునైతే తీయగలం
భావాన్నైతే బదలాయించగలం

కాలికి పడిన గాటు ఎప్పటికి మానేనో
మదిని కోసిన భావం ఎన్నటికి చితి చేరేనో

గతంలోనే బ్రతకమనే గమ్మత్తైన పయనం ఇది
గమ్యం చేర్చు గమనంలో గాబరా పరిచే కథే మీది
విజయంతో వీరోచితంగా వెళ్ళమనే విధే నాది.🤘

-


7 AUG 2019 AT 22:56

ఉపశీర్షికలో

-


7 AUG 2019 AT 13:52

అంబలా నేల పుణ్యం ఈ అందాల బొమ్మ
చిన్న వయసులో మంత్రి అయిన చిన్నమ్మ
పార్టీ లో తొలి మంత్రి అయిన నీవు
దేశ మంత్రి అయిన విదేశాంగ మంత్రి అయినా
పార్లమెంట్రీయన్ అవార్డు పొందిన ఘన చరిత
రాజకీయ కుతంత్రాన ఏ రంగు అంటని కమలానివి
అందమైన కట్టు బొట్టు తో భారతీయతకు
మారుపేరైన చిన్నమ్మా
నింగికేగిన నీకు జాతి జెండా చీరమ్మ
వందనమమ్మా భారత మాత కన్న
వీర వనిత ఘన చరితా

-