Sesha Lakshman Peddinti   (వసుధ✍)
54 Followers · 36 Following

read more
Joined 20 May 2018


read more
Joined 20 May 2018
29 DEC 2024 AT 12:28

బాధ ఒకరిది...
భయం ఒకరిది...
కష్టం ఒకరిది....
కంటనీరు ఒకరిది...
ఆలోచన ఒకరిది...
ఆవేదన ఒకరిది...
త్యాగం ఒకరిది...
త్యాగ ఫలితం ఒకరిది...!

నిన్ను కన్నతల్లిదండ్రుల భావాలు...
ఒక్కటై మనసులో దాగి...
ఆనందం వెల్లువై పొంగిన ఆ క్షణానికి అర్ధం నీ జన్మదినం...!
రెప్పపాటు క్షణానికి దక్కిన పట్టాభిషేకమే నీ పుట్టినరోజు సందర్భం....
సంతోషంతో సాగిపోవాలి....
ఆప్యాయానురాగాలకు చిరునామా నీవవ్వాలి....
వెన్నంట్టుండాలి నీకు అందరి ఆశీస్సులు...
గెలుస్తూనే వుండాలి ఎల్లప్పుడూ కాలంతో సాగే పోటీలో....
కాంచనాధిపతి కటాక్షం నీపై కురవాలని....
ఆశీస్సులనే ఆకాంక్ష గా మలుస్తూ.....
పుట్టిన రోజు శుభాకాంక్షలు.

-


26 DEC 2024 AT 22:47

నిన్నటి రోజు నేనొక బంధం...
నేడు నేనొక పరిచయం...
రేపటి రోజు చేరలేని దూరం...!
అలుసుగా చూస్తే , కాలమే ఓ సమాధానం....!!

-


12 NOV 2024 AT 18:02

మేమిద్దరం - ప్రేమికులం :-
*******************
ఒకరంటే ఒకరికి ప్రాణం...
గొడవలు పడుతుంటాం...
క్షమాపణలు అడుగుతాం...
సంతోషాలని ,బాధల్ని పంచుకుంటాం....
భయంగా ఉంటే ధైర్యం చెప్పుకుంటాం....
అబద్దంలో ప్రేమని ఇష్టపడతాం...
నిజంలో మా ప్రేమని గౌరవిస్తాం...
స్వేచ్ఛా , స్వాతంత్ర్యాలు అంటూ వాదించుకోం....
చెప్పుడు మాటలకు చాలా దూరంగా ఉంటాం...
సందర్భమేదైనా సమస్య రాకుండా జాగ్రత్త వహిస్తాం...
స్నేహమో , మోహమో , వివాహమో కాదు మాది...
ఏ జన్మలో రుణమో ఏమో...
ఈ జన్మలో ఒకరికొకరం...!
ఉన్నంత కాలం మేమిద్దరం ప్రేమికులం....!!

-


22 OCT 2024 AT 22:56

కనులు చేసే తంత్రమా..?
నీ చూపుల వశీకరణం...!
నీ చిరునవ్వులే గాలమా...?
చిక్కితే బానిసత్వమే...!
చెలీ నీ మాయలో.....!!

-


1 MAY 2024 AT 8:10

జీవనం ఓ పోరాటం....
నిత్యం బతుకు అలసటల పయనం...
తగిలే గాయాలు శరీరాలను శిధిలం చేస్తున్నా ....
ఆకలి వెతలు శ్రమను కష్టంగా మార్చి రచిస్తున్నా....
అంతరం లోని లావాలు మింగేందుకు సిద్ధంగా ఉన్నా ....
సూర్యోదయాలెన్నో చీకట్లోనే కనుమరుగవుతున్నా....
ఊహించని ఆధిపత్యాలు వెనక్కి నెట్టుతున్నా....
ఆలపించే సంగీత స్వర గానమే శ్రామికుల జీవన విధానం...
ప్రతిరోజుని మై డే గా తలుస్తూ , ప్రపంచానికి వెన్నుదన్నుగా నిలుస్తూ....
సేవలందించడమే ముఖ్యమంటూ...
పిడికిళ్లే ఆయుధాలుగా...
గుండె ధైర్యమే గుర్తింపుగా సాగే శ్రామికులకి...
కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు .

-


2 APR 2024 AT 14:26

#నేటిలోకం :-

నటనలే జీవితాలు...
సృష్టి కి ప్రతిసృష్టి వ్యాపకాలె కొత్త పోకడలు...
పాడుబడిపోయిన సంప్రదాయాల పద్దతులు...
విలువలకు తిలోదకాలు , శూన్య ప్రశంసలు ....
నిప్పుల కొలిమిలో కాలిపోయే కట్టుబాట్లు...
వంచనలే సత్యాలంటూ మోసంచేసే ప్రచారాలు....
ఆకాశమెత్తు అన్యాయాలు , హద్దులే లేని అరాచకాలు....
అవినీతికి దన్నుగ బాహాటపు ఆహ్వానాలు....
గమ్యాలెరుగని ప్రయాణాలు...
గగనంతర ఆర్భాటాలు....
అసువులు బాసిన ఆప్యాయతానురాగాలు....
నమ్మకం లేని మనుషులు....
నమ్మాలో లేదో అనే సందిగ్ధాలు.....
సమాధికి చేరువలో సంతోషాలు....
కలల్లో జీవిస్తే శ్మశానాలే మన చిరునామాలు....!
ఎందరో మనుషులు , ఎన్నోరకాల మనస్తత్వాలు , ఆలోచించి అడుగేస్తేనే అర్ధమగును ఈ లోకం తీరుతెన్నులు...!!

-


1 APR 2024 AT 12:08

మన వెన్నంటి నిలబడే నీడలు ....
అడిగినవి కాదంటే కోపాలు...
గంపెడంత మూటకట్టి దాచుకునే ఆశలు...
అసలైన సంతోషాలకి సొంత రూపాలు...!

-


20 FEB 2024 AT 23:56

మనసుతో సంబంధం లేని సంసారాలెన్నో...
పరువుల కోసం చచ్చిపోతున్న మనసులెన్నో....
దూరమనేది మనసులకు దగ్గరేమో....
దూరమనేది మనుషులకు మాత్రం శాశ్వతమే...
నా ప్రతి అడుగు నిను చేరాలనే...
నువ్వు నాతో లేకున్నా......

-


4 FEB 2024 AT 10:10

916 హాల్ మార్క్ ష్యూరిటీల గుర్తింపే అంతా....
100% ప్యూరిటీ పలకరింపులు మాత్రం శూన్యం....!!

-


25 JAN 2024 AT 22:51

ప్రేమలోకం....
పరవశాన్ని నింపుకునే మనసుకి క్షణమే ఓ యుగం....!
నిండు పున్నమి రాత్రికి వన్నెతీసుకురాదా...?!
మదిలోని ఆశ నీస్థానమైతే...
నిను చుట్టుకునే అల్లిక ప్రేమవదా....!
మది కోరుకునే కౌగిలి నీదైతే....
ప్రేమలేఖలోని వెన్నెల ప్రేయసి నీవేగా....!!

-


Fetching Sesha Lakshman Peddinti Quotes