వాగ్దానం అంటే
నువ్వు చేసేది కాదు
వారు నమ్మేది
-
అందమైన సాయంత్రం, అందులోను ఏకాంతం
నిన్ను కోరే నా హృదయం, పరితపించె నీ కోసం
నిన్ను చూసే ఏ నిమిషమైనా వేడుకవ్వదా....
చెలి.. వేచి చూడనా.... వేదికవ్వనా.
నిను చూసే క్షణమైనా గుర్తుండిపోయేలా
కనురెప్పే కుంచెగ మారి నీ చిత్రం గీసెయదా
చిరుగాలి నిను తాకి రాదేంటి నా వైపు
నీ కౌగిలినే విడనంటూ మారాము చేస్తోందా
తీయతీయగా.. ఎంత దాహమో
నీ పెదవి తాకిన వానజల్లుకు
వేడివేడిగా.. ఎంత మోహమో
నీ ఎదను చేరిన పైట చెంగుకు
పరువాల వాకిట్లో వాగ్దానం చేస్తున్నా
నిను వీడె క్షణమేది క్షణమైనా రాదంటూ
పరదాలు తొలగించి నను చేర రావేమే
సరదాలు తీరేటి స్వర్గాన్ని చేరేలా
అడుగు అడుగునా.. ఎంత విరహమో
నిన్ను కోరిన నా మనసుకు
విడిది చేయనా.. నా మనసును
విన్నవించగా నీకు ప్రేమను
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
-
మొదటి చూపులోనే
మన మనసుల బాసలు ...
పరిచయాన్ని పెంచిన
మన ఇద్దరి లేఖలు ...
కళ్ళలోన కళ్ళు కలిపి
పంచుకున్న ఊసులు....
చేతిలోన చేయి వేసి
చేసుకున్న వాగ్దానాలు ...
నిన్ను నన్ను ఒక్కటి చేసిన
మన పరిణయ క్షణాలు...
నూరేళ్ళ జీవితంకై
మనం కన్న కలలు...
ప్రతి జ్ఞాపకం పదిలమై
ఎద తాకెనీ తలపులు ...-
ఊరికే ఇచ్చేశా అనే
వాగ్దానం
కన్నా
ఉన్నంత వరకు నాతో
ఉండేలా
వాగ్దానం
మిన్న!-
నాకు నువ్వు నీకు నేను
అని చేసుకున్న వాగ్ధానం
నన్నొక కొత్త బంగారు
లోకంలోకి తీసుకెళ్లింది
కానీ నేడు
నువ్వెవరు అనే అహంకారం
అధపాతనికి దిగజార్చింది
వాగ్దానపు తాలూకు
అనుభూతులు లేవు
వాగ్వివాదపు తాలూకు
అనుభవాలే మిగిలాయి
నాలాగ నన్ను
లేనివాన్ని చేసాయి..
-
తలమీద చేయి వేసి వాగ్దానం చేసి,
అగ్నిని సాక్షిగా ఉంచి ప్రమాణం చేసి,
పంచభూతాలను ప్రత్యక్షిగా ఉంచి ఒట్టు కట్టి,
ఇన్ని బాసల ఆధ్వర్యంలో స్త్రీ తలవంచి తాళి కట్టించుకునేది మగజాతికి భయపడికాదు,
తన జీవితానికి పరమార్థం సృజింపజేయాలని!
అందమైన కుటుంబం నిర్మించాలని!
మగువ మనస్సు కష్ట పెడుతూ వ్యవహరించే నరరూప రాక్షసులకు ఏనాటికి అర్థం అవుతుంది ఈ మూడుముళ్ళ బంధం???!!
-
మనిద్దరని జతచేసిన ఓ సుముహూర్తాన,
అపరంజిలా ముస్తాబైన నువ్వు,
వేడుకకు సిద్దమైన వేదిక,
సాక్షిగా నిలిచిన అగ్ని,
ఆశీర్వదించ వచ్చిన అరుంథతి,
మంత్రాలు పఠించిన పంచభూతాలు,
అడుగులో అడుగు కలిపిన సప్తపది
బంధుమిత్రులు, మంగళ వాద్యాలు
నేనుకట్టిన పుస్తెలు,
నువ్వు పంచిన తలంబ్రాలు
ఇందరి సమక్షంలో,
వధూవరులైన మనం దంపతులైన తరుణంలో,
ఆనాడు నే చేసిన వాగ్దానం
ధర్మేచ అర్దేచ కామేచ మోక్షేచ నాతిచరామి
నాతిచరామి.
-
ఏ క్షణం చేర్చిందో ఈ సమయానికి
విల్లును వదిలిన బాణం ఏమో
అలసట తెలియని ఈ పయనం
మరో రేయి చూడకుంది ఈ శ్వాసలని
గతం చేసిన వాగ్దానం ఏమో
ఆశ్చర్యం చాలని ప్రతి తరుణం
-
ప్రతిక్షణం ప్రేమను పంచుతూ
నా ఉసురు నీకేనంటూ తెలుపుతూ
జీవిత పుట్టాను నీ ప్రేమ అక్కరాలతో అలంకరణగా నింపుతూ
నా మేను మన్నులో కలిసే త్రుటిలోనైనా సరే
నీ తోడు వీడలేనని నా వాగ్దానం-
రెండు హృదయాల మధ్య సంబంధాన్ని ప్రేమ అంటారు |
కానీ రెండు హృదయ స్పందనల మధ్య సంబంధాన్ని నిజమైన ప్రేమ అంటారు |
మీ నిజమైన ప్రేమ మరియు ఎప్పటికీ ప్రేమగా ఉంటానని నేను వాగ్దానం చేస్తున్నాను |
హ్యాపీ ప్రామిస్ డే ©సూర్యసముద్రససుర 💛
-