Roopa Rani   (✍️Roopa Rani Bussa)
2.4k Followers · 113 Following

read more
Joined 26 July 2017


read more
Joined 26 July 2017
YESTERDAY AT 8:57

#సమస్యాపూరణం9 #శిరోమణి #శివరాత్రి వ్రాసిన అందరికి ధన్యవాదాలు 🙏🏻

శిరోమణి, శివరాత్రి సవాలులో రాధికగారిని విజేతగా నిర్ణయిస్తూ
తదుపరి సవాలు ఇవ్వాలని కోరుతున్నాను


రాధికగారు అభినందనలు 🎉🎊😇

-


YESTERDAY AT 8:51

#శివరాత్రి #శిరోమణి
డమరుధ్వనియందు విశ్వనినాదములు
శూన్యాకాశమంతటా నక్షరములు
మనుగడకది శ్రేష్ఠమైన పంచాక్షరి
ప్రణవమందు వినిపించెను శివలీలలు

చూపె చూడు త్రినేత్రములొ సృష్టిదెసలు
నాట్యమాడు వేళ తెలిపె లయ రచనలు
యోగమందు యోగమిచ్చు శుభయోగుడు
చరాచరము లోన తెచ్చె చైతన్యము

భాగీరతిని జటిలోపల నిలుపుకొనెను
గరళమంత కంఠమందు నుంచుకొనెను
భస్మధూళి మేను పైన పూసుకొనెను
మహేశుడై మహాకష్టమడ్డుకొనెను

ఆశుతోషుడు కైలాసమెక్కినాడు
హిమ వృష్టిలొ లింగముగా వెలసినాడు
లోకములను నిరాకారుడేలినాడు
జగత్తంత రక్షించేటి సదా శివుడు

-


21 FEB AT 9:29

#సమస్యాపూరణం7 #ఒత్తిడి సవాలుకుగాను విజేతగా నిలబడిన అల్లాది సృజన్ గారు వ్యస్తంగా ఉన్న కారణంగా రజనిగారి కోరిక మేరకు తదుపరి సవాలును నేను ఇవ్వడం జరుగుతున్నది 🙏🏻🙏🏻

#సమస్యాపూరణం8 వ్రాసిన అందరికి ధన్యవాదాలు.

#సమస్యాపూరణం9 #శివరాత్రి అను అంశంపై
#శిరోమణి పద్యమును వ్రాయాలని కోరుతున్నాను

విశేషమేమిటంటే శిరోమణి పద్యమును సృష్టించినవారు మన గురువుగారు @శివాజీ బొడ్డుగారు

గడువు- ఒక్క వారం
నియమాలకు శీర్షికను చూడగలరు

-


18 FEB AT 7:54

అన్నింటా నేనుండాలంటు
ఆరాటము అధిగమించి
స్వార్థపు ఊభిలో
చిక్కి కృశించెను సొలసి

ఆలోచనల దాడికి
మిడిసిపడి సొమ్మసిల్లి
అనారోగ్యపు వడికి
నలిగె మళ్ళీ మళ్ళీ

అందుకే హృదయమా!
ధ్యానాదులు చేసుకుని
మనసును మళ్ళించు
పక్వపు బుద్ధిననుసరించు

తనకు మాలని
చేష్టలు మానుము
ఒత్తిడి తరుగును
స్వాస్థ్యము పొందును

-


8 FEB AT 8:25

#కందపద్యం #అతివ
నవ్వులు సన్నగ నవ్వుతు
మోసెను కోట్ల తలఁపులు మొత్తము మదిలో
కష్టము చూపక కాంతా
చేసెను ఇంట్లో సేవలు చెలిమితొ నెప్పుడు

పున్నమి వెలుగుల పద్మాక్షి
జాబిలినొసగేటి గగనపు జలధిజుడు మల్లె
సభ్యులనెప్పుడు సబబుగ
నుంచుతు నందరికి హృష్టి నొనర్చును సాధ్వి

భామిని యుంటే భాగ్యము
అర్థము చేసుకొ అంగన అర్థించ వద్దు
మీ మంచి కోరు మీ నాతి
బాసటగ చూడు ఎప్పుడు బానిసగ కాదు

-


2 FEB AT 8:57

ಎಂದು ಸ್ವಾರ್ಥಪರರಾಗದಿರಿ
ಪರರ ಹಿತ ಕೋರುತ
ಸ್ವಚಿಂತನೆಯನ್ನು ಬಿಡದಿರಿ

ನಮ್ಮ ಮಿತಿ ಎಲ್ಲೆಂದು
ಗೆರೆ ಹಾಕಲು ಮರೆಯದಿರಿ
ಎಲ್ಲದರ ಮಿತಿ ಅರಿತು
ತೊಡಕಿಲ್ಲದೆ ಬಾಳಿರಿ

-


1 FEB AT 21:20

#సమస్యాపూరణం6 అందరూ చాలా బాగా వ్రాసారు. వ్రాసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ సవాలుకుగాను రాధికగారిని విజేతగా తెలుపుతున్నాను.

రాధికగారు అభినందనలు 💐💐

మరో సవాలు ఇచ్చి సమస్యాపూరణలను కొనసాగించాలని కోరుతున్నాను 🙏🏻💐

-


27 JAN AT 0:59

మధువుల వేడుకలు
నాకొచ్చిన అద్భుతము
మధువులొసగు విరులు
నాకెంతో ఇష్టము

చైత్రపు వన్నియల్లో
నా వంతుందంటు
రూపురేఖలన్ని గరుత్తుల్లో
విశదించెద చుట్టు

మదనుడి అందానికి
తగ్గని వైనం
అలరుల సొగసుకి
శుష్కని చందం

ఇలకు ఏతెంచితి
మెరుపల్లె నేను
ప్రకృతిని నడిపించితి
సీతాకోకచిలుకయను నేను

-


24 JAN AT 6:19

#సమస్యాపూరణం5 #పద్యసరళి #అయోధ్యారామ సవాలులో నన్ను విజేతగా నిలబెట్టిన అవి అమ్ములు గారికి ధన్యవాదాలు 🙏🏻🙏🏻
తదుపరి సవాలుకు గాను “మెరుపులు” వ్రాయాలని ప్రార్థన

అంశం-
మీకు ఇష్టమైనదైనా వ్రాయవచ్చు
లేదంటే
వసంతం ముందు కోయిలల మనస్సులో గాని సీతాకోకచిలుకల మనస్సుల్లో గాని ఏ విధమైన భావనలు ఉంటాయో మీ రచనల్లో ప్రకాశింపగలరు

గడువు- ఒక్క వారం
నియమాలు- శీర్షికలో

అందరూ పాల్గోవాలని కోరుతున్నాను.
మీకు తెలిసిన వారిని సవాలు వ్రాయడానికి ప్రేరేపించగలరు 🙏🏻🙏🏻

-


22 JAN AT 23:32

#राममंदिर
तब समुद्र में राम लिखकर पत्थर फेंके
सेतु बाँधकर सीता को साथ लाए
अब राम नाम स्मरण कर कर ईंट जुड़े
मंदिर बनाकर स्वयं राम जी आए

रामचन्द्रजी अयोध्या में विराजमान हुए
मंत्र यज्ञ से सब के पाप नाश हुए
भक्ति भाव से रामजी की दर्शन करें
होवे उन्नती उसकी जो राम राम बोले

-


Fetching Roopa Rani Quotes