'మ'త్తెక్కి౦చకే కనులతో
'గు'౦డెను గుచ్చే హొయలతో
'వ'లపు వలలో చిక్కితినే!!!
- మగువ-
మదిలో మనసెరిగిన మగువ మధుస౦భాషణ౦
మరునిమిషమే మతిలేని మస్తిష్క౦ మరిచెను మసులుకునే మనుగడతత్వ౦
మరిమరి మది చేసే మర్కటపు మాయాజాల౦
-
మెరుపులా మెరుస్తూ ఆకట్టుకుంటుంది
అమ్మవారితో పోల్చబడుతుంటుంది
ప్రతి ఒక్కరిని మైమరపిస్తూ ఆకర్షిస్తుంది
దురాశతో చూస్తే మన పతనం మొదలవుతుంది
చాలా అపురూపంగా అందరిచే చూడబడుతుంది
అరుణోదయపు సూర్యుడిలా మురిపిస్తూ ఉంటుంది
ఆకసంలో చుక్కల్లా మెరిసిపోతూ అద్భుతంగా ఉంటుంది
వన్నెలతో మిలమిల మెరుస్తూ చందమామకే పోటీ ఇస్తుంది
// బంగారం(అమ్మాయి) //-
కుటుంబం కోసం తన జీవితాన్ని అంకితమిచ్చే మగువ
నేడు తన ప్రాణ రక్షణ కోసం చూపించక తప్పదుగా తెగువ-
మానసికంగా గాని
శారీరికంగా గాని
నా దృష్టిలో
ఆడదే చాలా స్ట్రాంగ్ ..
ఈ ప్రపంచంలో
అందరికన్నా
తురుంఖాన్ అని
ఒకడుంటే
వాణ్ణి కన్నది ఆడదే..
కన్ను తెరిస్తే
ఈ ప్రపంచాన్ని
అంతం చేసే
ఎంతో శక్తి ఉన్న
శివుడి గుండెల పై
కాలు మోపింది
కాళికామాత ఓ ఆడదే..-
చెవులకు జూంకీలు
ఊగుతుంటే
నా గుండెల్లో ఏదోదో
అలికిడి అల్లరే ఓ చిట్టీ
చేతి గాజులు
గల్లుమంటే
నా తణువంతా
చెక్కిలిగిలిగిలి చేష్టలే నా కుట్టి
గంధం నీ అందం
చందనం నీ చందం
మకరందం నీ గుణం
మంచితనం నీ తత్వం
మగువ
మానవజాతికి నీవో ధైవం
సృష్టికి నీవే కదా మూలం
-
అక్షరము ముఖ్యమా
బ్రతుకు ముఖ్యమా అంటే
నాకు బ్రతుకే ముఖ్యం
అక్షరము అధికార పత్రముగా మారినా
దాని పరిధి లోనికి రాని బతుకులెన్నో
అన్నిటిని అధిగమించి
ఊపిరోసుకొనే బ్రతుకు పోరాటమిష్టం
అక్షరము నేర్చక పోయినా
కన్నపేగు మమకారంతో
బ్రతుకును సమిధగ మార్చే
ఆడ కూతురి బ్రతుకు చేవ ఇష్టం
బాధ్యతలలో నలిగి కుమిలినా
తన పిల్లల చిట్టి చేతులను
ఒడిసి పట్టి కష్టాల అగ్ని గుండం దాటే
అతివ బ్రతుకు తెగువ ఇష్టం
కోరికలన్నీ బూడిదగా మార్చి
విలువలను నలుసులకు నూరిపోసి
సాన పెట్టిన కత్తిలా మలిచే
మగువ ఇష్టం తన మాట ఇష్టం
సుమనప్రణవ్
-
హే మగువ...ఓ మగువ!
తెలుపు నలుపుల చింత నీకేల
నీ నవ్వే భాను కిరణం...
హే మగువ...ఓ మగువ!
లోకులు కాకుల గోల నీకేల
నీ మనసే మంచు వెన్నెల...
హే మగువ...ఓ మగువ!
మగవాళ్ళతో పోటీ నీకేల
సృష్టిని పుట్టించే శక్తి నీవు...
-