గౌరవం...
హోదాకా....!?
వయసుకా....!?
మనిషికా....!?
లేక ఉన్నతమైన విలువలకా...!?-
పిల్లలతో ప్రేమగా ఉండాలి.
పెద్దలతో గౌరవంగా ఉండాలి.
స్నేహితులతో చిలిపిగా ఉండాలి.
సమాజం పట్ల బాధ్యత గుర్తెరిగి ఉండాలి.🤘-
గౌరవం మర్యాదలు ఇవ్వడం అనేది నీలో ఉన్న మంచితనానికి నిదర్శనమైతే,
నీకు గౌరవ మర్యాదలు ఇవ్వకపోయినా కూడా నువ్వు మంచితనానికి మారు పేరులా ఉంటా అంటే మాత్రం అది నీ తెలివితక్కువ తనానికీ, తెలియని తనానికి నిదర్శనం.
ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉండాలి, ఇది
కలికాలపు కనువిప్పు సూత్రం.🤘-
నన్ను ఎదుటి వారు తిరిగి గౌరవించాలనే
ఆశయంతో ధ్యేయంతో ఎదుటివారిని నేను గౌరవించను
నాకు ఎదుటి వ్యక్తిని గౌరవించడం నాకు ఆనందం
నా వ్యక్తిత్వం నా నీతి నైతికత
నన్ను వారు తిరిగి గౌరవిస్తే ఇంకా ఆనందం
కానీ వారు నన్ను అగౌరపరచకుండా అవమానించకుండా ఉంటే చాలు
నన్ను ఎదుటి వారు తిరిగి అభిమానించాలనే
ధ్యేయంతో ఆశయంతో నేను ఎదుటివారిని అభిమానించను
వారి భావాలు వ్యక్తిత్వం కవిత్వం,దేవత అందం ద్వారా
నాకు ఆనందం కలిగించిన వ్యక్తులను
అభిమానించడం ప్రశంసించడం
నాకు ఆనందం అది నా ఆనంద కృతజ్ఞతలు💛
అది నా వ్యక్తిత్వం నా మనస్తత్వం నా నీతి నైతికత
నన్ను వారు తిరిగి గౌరవిస్తే చాలు
ఎదుటి వారు నన్ను అభిమానించాలనే
ధ్యేయంతో ఆశయంతో నేను ఎదుటివారిని ఆరాధించను
వారి వ్యక్తిత్వాలు భావాలు కవిత్వాలు
దేవత అందాల ద్వారా నేను ఎక్కువ ఆనందం ఆస్వాదన పొందడం వలన
వారిని ఆరాధించడం ప్రశంసించడం పూజించడం
వారిని ఆనందింపచేయడం నాకు అత్యంత ఆనందం
నాకు అమృతం నా ఆనంద కృతజ్ఞతలు నా భక్తి
నా వ్యక్తిత్వం నా మనస్తత్వం నా నీతి నైతికత
నన్ను వారు తిరిగి దీవిస్తే💛 చాలు🙏-
తాను మోస్తున్న గర్భం
ఓ ఇంటి గౌరవమో లేక తన ఇంటి పౌరుషమో
అనే ఆలోచనలు లేకుండా...
చెదరని చిరునవ్వు చూపిస్తున్న
మా వదినమ్మకు....హాట్సాఫ్...-
గౌరవానికి తలవంచి గౌరవం యొక్క గౌరవాన్ని నిలబెట్టాలో,
నమ్మకానికి ఇచ్చిన మాటకోసం నమ్మకాన్ని నిలబెట్టాలో తెలియని సందిగ్ధంలో నలుగుతున్న ఒక సగటు మనిషిని నేను.-
అవతలి వ్యక్తి నిన్ను
చులకనగా చూసినట్టున్నా
అగౌరవపరిచేలా మాట్లాడుతున్నా
ఆ వ్యక్తి ఇంకా ఎదగలేదని అర్థం
ప్రపంచాన్ని చాలా బాగా ఎరిగిన వ్యక్తీ
సమాజంలో ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి
నిన్ను గౌరవిస్తూ గౌరవం పొందుతుంటాడు.🤘-
కోల్పోయిన కాలాన్ని..
పోగొట్టుకున్న నమ్మకాన్ని..
మరకపడిన గౌరవాన్ని..
ఈ ప్రపంచంలో ఏ సిరిసంపదలు ఇవ్వలేవు..
...✍️వెన్నెల సీత-