Nandini Dodda  
98 Followers · 31 Following

read more
Joined 26 October 2019


read more
Joined 26 October 2019
27 APR 2021 AT 10:05


నా మది నిండా ఉన్న ప్రేమను
'నిన్ను ప్రేమిస్తున్నాను' అనే మాటలో
నింపేసి చెప్తున్నా సరిపెట్టేసుకో....

-


29 NOV 2020 AT 21:28

కనిపించనన్ని
రహస్య నిగూడాలెన్నో
దాచేశాయి
ఆమె కన్నులు

-


21 OCT 2020 AT 21:20


ఏమైందమ్మా అని అడిగాడు
బానే ఉన్నానన్నాను నేను.
ఇచ్చే విలువను బట్టి
చెప్పే మాట మారుతుందన్నాడు.
అర్ధం కాలేదన్నాను నేను
అందరికీ బాగున్నామని చెబుతాం
కానీ కొందరికే అన్నీ చెప్పుకుంటాం అన్నాడు.
అంత మాట అనేసాక 🙆
ఇంకేం దాయగలను నీ దగ్గర అన్నాను నేను.

-


19 OCT 2020 AT 22:01


కథలో కథగా కథనే కనగా
కథలో కథలే కథలై కదలగా
కథల వ్యధలకు కనులు కన్నీళ్ళెట్టగా
మదిన కదిలిన కథనే కవితగ కూర్చా.

-


29 SEP 2020 AT 22:06

నా కొంగుచాటుగా నిన్ను కన్నయ్యలా
పెంచాలని అనుకున్నా
నా కన్ను చిమ్మే కన్నీరుగా
మారావని తెలుసుకున్నా..
కోటి ఆశల అపురూపంగా
నిన్ను నవమాసాలు మోసానని అనుకున్నా
నాలో కడతెరని శోకానికి
ప్రాణం పోశానని తెలుసుకున్నా..
నువ్వు లేవని పుడుతున్న కన్నీరును
ప్రతి రోజు ఆపాలని అనుకున్నా
కడలల్లే మారిన కలతను
మట్టి పోసి పూడ్చలేనని తెలుసుకున్నా..

-


10 SEP 2020 AT 22:50


"నీకు ఈ గాల్లో తేలే పిచ్చెంటయ్యా"
అని అడిగా తనని
"ఆమె నేలన నడిచే వనిత కాదుగా.
నింగిన నివసించే దేవతని"
బదులిచ్చాడు.

-


26 AUG 2020 AT 23:52

నీ ఏడుపు వినపడగా
మా ఆనందాలకు ఆకాశం హద్దేగా..
నీ రూపును చూసుకుంటూ
మా పోలికంటే మా పోలికంటూ మురిసిపోయే
మా సంతోషాలు నింగిన మెరిసే తరలేగా..
తొలివారసుడివి నువ్వంటూ
మీ తాతలు గర్వంగా ఉప్పొంగారుగా..
నిన్ను నవమాసాలు మోసిన నాకు పునర్జన్మనిచ్చి
ధ్రువ తారవై నిలిచిన నీకు
జన్మదిన శుభాకాంక్షలు కన్నా..

-


9 MAY 2020 AT 21:21


నా కనులు ఎదురుచూసే
సందేశం వచ్చింది.
చిలకపలుకుల్లో
నా చెలికాడి ఊసులు
ఎంత వినసొంపుగా ఉన్నాయో ☺️
నన్ను కవ్వించమని
తను పంపిన కవితలు
ఎంత మురిపిస్తున్నాయో నన్ను 😍😊☺️

-


6 MAY 2020 AT 22:05

కన్నా...🙈

-


3 MAY 2020 AT 6:24

ఆమెను ఎప్పటికప్పుడు
మాయ చేద్దామని చూస్తుంటాడు అతడు

అతడి తలపై ఒక్కటిచ్చి
నీవల్ల కాదని వెక్కిరిస్తుంటది ఆమె..😅🙃😇

-


Fetching Nandini Dodda Quotes