వెన్నెలలా వెలుగులు చిమ్ముతుంది
మకరందము వలె తీయగా ఉంటుంది
అందెలా రవళిలా శ్రవణానందకరంగా ఉంటుంది
చల్ల గాలి వలె మైమరిపిస్తుంది
అమ్మ వలె అద్భుతంగా ఉంటుంది
నా మాతృభాష
తెలుగు-
మగువ
సుకుమార దైవిక పాదాల
సొగసు ముందు
పసిడికి విడిగా విలువ లేదని
అందెలుగా మారి
అందమైన పాదాలను హత్తుకుంటే
తన అందానికి విలువ ఉంటుందని
పసిడి అందెల అమాయక ఆశ... 🕊️🕊️-
తొలిసంధ్య వెలుగులో రవళించె నా అందియలు
మునిమాపు మసకలో వినిపించె నా హృదయార్తనాదాలు
ఉదయకిరణాలకు సొంపుగ కదిలే నా కాలి మువ్వలు
చంద్రకిరణాలకు ఉప్పొంగి కారే నా కంట కన్నీరు-
అందంగా అందెలు వేసుకొని
అలలు ఎగసిపడే సంద్రం వెంట
అల్లరి అల్లరిగా మాట్లాడుతూ
అడుగులు వేస్తుంటే
అంతరంగంలో ఎదో తెలియని
అలజడి మొదలైందే మీనాక్షి!!
...✍️వెన్నెల సీత-
నా కాలి అందెల
సవ్వడులతో నీ మదిని మీటి..
నా గాజుల గలగలతో
నీ మనస్సును మురిపించి..
నా చెవి ఝంకాలతో..
నిన్ను ఆకర్షించి..
నుదుటున తిలకంతో
తారాస్థాయికి తీసుకెళ్లి..
పాపిట్లో సిందూరమై..
నీ హృదయానికి ఉదయాన్నై
ఉదయించనా.. !-
కొమ్మల్లో కోయిల
సరాగాలు పలుకుతుంటే...
నా కాలి అందెలు
సవ్వడి చేస్తుంటే...
వర్షపు జల్లులు
నా మోముని తాకుతుంటే...
విరిసిన హరివిల్లును
చూసి మనసు మురిసిపోతుంటే...
వర్షంలో తడిచిందిచాలు అని
అమ్మ మొట్టికాయ వేసింది.
-