నీ వరకు కుటుంబమంటే దేశం
నీ వరకు ప్రేమంటే దేశాన్ని ప్రేమించడం
నీ వరకు మైమరిచి నిద్దరోడమంటే శత్రువుల
గుండెల్లో నిద్రపోవడం బార్డర్లో కళ్ళల్లో
వత్తులేసుక్కూర్చోవడం
నీ వరకు మమతంటే దేశరక్షణకు పాల్పడటం
నీ వరకు త్యాగమంటే దేశసేవకై ప్రాణమర్పించడం
నీ వరకు సంతసమంటే ఏ వైపు నుండి ఏ ముప్పు
వచ్చిపడుతుందోనన్న ఆందోళన లేకుండా
దేశప్రజలు సేదతీరడం
నీ వరకు విరామమంటే దేశానికంకితమై
భరతమాత గర్భంలో తలదాచుకోవడం
నీ వరకు వ్యక్తిగతమంటే కోటానుకోట్ల
భారతీయుల ఉజ్వల భవిష్యత్తు
నీ వరకు నేనంటే దేశం మనమంటే దేశప్రజానికం
నీ వరకు ఉత్సవమంటే శత్రవుని మట్టుపెట్టి
రక్తతిలకాన్ని నుదుటనలంకరించుకోవడం
నీ వరకు మనసంటే పిడుగుపాటు కాల్చి
బుగ్గి చేసినా ఇసుమంతైనా వెనక్కి తగ్గక
దేశభక్తిని క్షణక్షణం నీలో పురుడుపోయడం-
దేశ సరిహద్దుల్లో ఉంటూ
శతృదేశాల నుండి దేశాన్ని
రక్షించడం ఆ సైనికుల ధర్మం
దేశంలోపల ఉంటూ
దేశ ద్రోహుల నుండి దేశాన్ని
రక్షించడం పౌరుల ధర్మం.
దేశం మీద ప్రేమ, గౌరవం ఉన్న
ప్రతీ పౌరుడు సైనికుడే.🤘-
ఓడిపోతే తన ఒక్కడి ప్రాణం
గెలుపొస్తే తన దేశ ప్రజల ప్రాణాలు
దేశరక్షణకై సైనికుడి నిత్య ఆలోచన.-
అమ్మ పేగుతెంచి జీవితాన్ని ఇస్తే
నాన్న కష్టార్జితంతో జీవితాన్ని ఇస్తే
గురువు విద్యాబుద్ధులు నేర్పి జీవితాన్ని ఇస్తే
నువ్వు మాత్రం నీ జీవితాన్ని అర్పించి
మా ఈ జీవితాల్ని వరంగా ప్రసాదించావు.
సరిహద్దుల్లో సైనికుడా నీకు ఈ దేశం తరపున సలాం.😇🙏🇮🇳-
దేశాన్నీ,
సమాజాన్నీ,
బాగుపరచాలనే
స్పృహ నీకు లేనప్పుడు
దేశాన్నీ,
సమాజాన్నీ,
విమర్శించాలనే
పని లేని ఆలోచనలు మానుకో
బాధ్యత మరిచిన నీకు దేశాన్ని విమర్శించే హక్కు లేదు.🤘-
నీ కర్తవ్యం నువ్వు పాటిస్తూ
నీ బాధ్యత నువ్వు నెరవేరుస్తూ
నీ గమనాన్ని గమ్యం దిశగా తీసుకెల్తుండు
నీ ప్రతిభని ఈ ప్రపంచం ఏదో ఒక రోజు గుర్తిస్తుంది
ఆ గుర్తింపు మరణం ముందు రావచ్చు,
ఆ గుర్తింపు మరణాంతరం ఐనా రావచ్చు
సమరంలో షహీద్ అయ్యాకే
సైనికులకు ఎక్కువ గుర్తింపు వస్తూంటుంది
కానీ,
ఏ సైనికుడూ గుర్తింపు కోసం మాత్రం పనిచెయ్యడు
దేశ బాగోగుల కోసం పనిచేస్తే నువ్వూ ఒక సైనికుడే.🤘-
ఒక ప్రాణాన్ని కాపాడాలంటే
ఇంకో ప్రాణం తీయాలని రాసుంటే
తలరాతని చెరపడానికి నువ్వు నేను ఎవరం?
సందేహంగా ఉంటే సరిహద్దుల్లో సైనుకుడిని అడుగు.🤘-