" ప్రేమ "
ఖరీదైనది కాకపోవచ్చు కానీ
వెల కట్టలేనంత విలువైనది.
-
తొలిసారి ఒకర్ని చూసినపుడు ఏర్పడ్డ తడబాటు,
మదిని మురిపించేంత మాధుర్యముగా ఉన్నా
ఆ తదుపరి
తెలియని అలజడులతో ఏర్పడే ఎడబాటు,
మౌనంతో మిథునం చేకూర్చేంత
మహామాయగా ఉంటుంది.-
దేశాన్నే అమ్మేయాలనుకునేవాడికి అమ్ముడుపోవడము..!
అమ్మడు కోసమని అమ్మను వదిలేయడము..!!
ఇవన్ని కూడా
మానవులు అభివృద్ధి చెందుతున్నామన్న భ్రమలో
మానవవిలువలను వృద్ధాప్యములోకి
నెడుతున్నారననటానికి ఆనవాళ్ళు..!!!-
Friends:
The Delicate hearts who holds
Delightful memories.
The Relative souls who Render
Elated Wonders.
The Emotive minds who neither
Desperate nor separates.
The Authentic bond which never
Exhibit Synthetic feelings.
-
" Friend "
May Not be the person who BELONGS to you.
But,
Definitely The person who'll BE ALONG with you.-
మానం కన్నా అభిమానం గొప్పది,
రాగం కన్నా అనురాగం గొప్పది,
ధనం కన్నా వందనం గొప్పది,
సౌఖ్యము కన్నా లౌక్యం గొప్పది,
ప్రాణం కన్నా ప్రమాణం గొప్పది,
అందం కన్నా.....
ఆ అందాన్ని కన్న బంధం గొప్పది...!
"అమ్మ" గొప్పది.....!!!
-
Don't BEG INNING of freedom
in life from any others.
Just Leave them and
Start a New BEGINNING in your life.
-
ఆనందమయమైన జీవితమనేది,
మనస్సులో అనన్యమైన ప్రేముంటేనే సాధ్యమవుతుంది.
మనస్సుల్లో అనన్యమైన ప్రేమ ఉన్నా,
మనుషుల మధ్య అన్యోన్యత ఉంటేనే..
ఏ బంధమైనా చిరకాలం నిలబడుతుంది.-
మనం ప్రేమించిన వారు మనతో ఉన్నప్పుడు,
ఆ హాయిలోని శోభను,
వాళ్ళు తోడుగా లేనప్పుడు
ఆ మనోభావాల క్షోభను
వివరించేకొద్దీ, వర్ణించేకొద్దీ
ఆ వివరించే వేళకు కళ వస్తుంది కానీ ప్రేమ కళ మాత్రం తగ్గదు... !-
అన్నము ఉడికిందా లేదా అని తెలియాలంటే
ఒక్క మెతుకు చూస్తే సరిపోతుందంటారు.
మరి, అన్నం మాడిందో లేదో తెలియాలంటే
ఆ గిన్నె అడుగున చూస్తేనే తెలుస్తుంది.
అలాగే, ఒకరి వ్యక్తిత్వం కూడా ఆ వ్యక్తి తాలూకు
భావాలను పైపైన చూచి నిర్ధారించలేము.
సమాజము వలన తాను అనుభవించిన బాధలతో
అడుగంటిన ఆశలెన్నో ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి.
ఎంతైనా..., మాడిన అన్నము తిన్నవారికే
పరమాన్నము యొక్క విలువ గూర్చి తెలుస్తుంది.
అలాగే, ఇతరులలోని
లోలోపలి బాధలను గ్రహించి సాయం చేసేవారికే -
సంతోషము యొక్క అసలు అర్థం తెలుస్తుంది.
జీవితంలో ఎనలేని ఆనందం లభిస్తుంది.
-