జీవితాన్ని ఓర్చి తీర్చే యోధురాలికి
వేయ కళ్ళుంటే సరిపోతుందేమో మరీ
వలా కలా ఇంద్రజాలికుని పంజరమా
మాటేసే కాలమా వాటేసే వ్యసనమా కాల్చేసే కామమా.....
మాయ మాటల తాత్కాలిక శిబిరమా
యుగాల నుండి బేలగా ఏడ్చినది సరిపోదంటూ
చతికల పడితుంటారు
జీవితానికి సరిపడా పాఠం నేర్చినా సరే
ఎదురీదలేక సరిపోల్చలేని ప్రేమల్లో కొట్టకుపోతూనే ఉంటారు
నవ్వులు నగుబాట్లలో నలుగూతూఉంటారు
కాల్చేస్తే బూడిదయ్యే శరీరం తల్లీ ఇది
అందాలూ ఐహిక సుఖాలు కాలిగోరనుకొంటే
ఆత్మవిశ్వాసం వెన్నంటి ఉంటే కుటుంబాలు
సమాజాలు దేశాలు ప్రపంచాల సుఖశాంతులన్నీ నీతోనే.....-
వేటగాళ్ళ వలలకు
చిన్ని చిన్ని చేపలే
చిక్కి సచ్చెనంట
పెద్ద పెద్ద తిమింగళాలు
వలలకు చిక్కకుండా
తప్పించుకు తిరిగెనంట-
"ఆయనే ఉంటే ఎదురింటాయన తో పనేంటని"
ఓ మోటు సామెత...ఆమె/అతను అయినా
మనసెరిగి మసలుకుంటే..ప్రాణం లో ప్రాణంగా కలిసిపోతే.. మూడో మనిషి అన్న ప్రశ్న నే ఉత్పన్నమవదు అన్నది అక్షర సత్యం!
(శీలం అన్నది ఇద్దరికీ ఉండాలి
పురుషుడు కేమీ కొత్తగా కొమ్ములేవీ
లేవు...మన పురాణాలు స్త్రీ కి మాత్రమే అన్నట్టు
నూరిపోసాయి!)
(ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఈ
కొలాబ్ ని అందరూ ఒప్పుకోవాలని లేదు!!)-
వేల నవ్వుల వల
కోళ కన్నుల కల
కాళ్ళ మువ్వల కళ
నీల వన్నెల అల
మారెనిలా నీలా
అయ్యెను నే విల విల...-
మాయ ఓ వల ...
మాయని తెలిస్తే
మనిషి
మాయని గెలిస్తే
ఋషి
మాయని వలస్తే
మహిషి ...
... ✍ "కృష్ణ" కలం-
ఎంతమంది ఉన్నా
ఇంకొకరు కావాలి
ఇదే మనసు యొక్క ప్రకృతి
ఇది లోకంలో అందం
ఎంతమంది ఉన్నా
ఈ ఒక్కరు నాకు చాలు
ఇది మనస్సు పొందే తృప్తి
ఇది లోకంలో ఆనందం
-