Passion is not in
Dreaming or waiting
It's in believing in it
Let me begin
Hundred times
Just for a dream-
When every day is
A bitter ending
Life is life
In the ending
Or in the beginning-
నీ కన్నులు తడిపినా
కన్నులు తుడిచినా
రెండూ నేనేలే
చిరునవ్వులు చిందించినా
నవ్వులు విరబూయించినా
నీకన్నీ నేనేలే-
పిలిచేందుకు ఎవరు లేరని
పిలిచినా ఎవరు రారని
చెప్పినా వినేవారెవ్వరని
చెప్పుకునేందుకు..
ఐనా తనకెవరున్నారని?
తనకి తాను తప్ప
తనతో తన నీడ తప్ప
మనుషులున్నారని లేరని చూడడు
ఒంటరి వాడు కాదు అతను
కళ్ళు మూసినా తెరిచినా..
కనిపించే కల ఒకటుంది
అది అతని గుండె చప్పుడైంది
శ్వాసలో కలిసింది.
నరనరాల్లో నెత్తుటి బోటులో
తన కల తనతోనే ఉంది
అయినా నా చిరునవ్వుని చెరిపే
మంత్రమే లేదు
తన కళ్ళల్లో ఎన్నో కలలు
తన కలల్లో ఎన్నో కథలు
తన కథలో ఎన్నో కలలు
కన్నుల నిండా కలలు
నిద్రపోనివ్వని కళలు
కానివ్వవు అతడిని ఒంటరివాడిని-
మనిషికి భగవంతుడిచ్చిన ఒకే ఒక వరం
కోరిక
దానితో ఏమైన చెయ్యొచ్చు
- గస్తీ-
గిల్లి కజ్జాలు
కవ్వింపు చర్యలు
కయ్యానికి కాలు దువ్వడాలు
అప్పుడప్పుడు అలకలు
కొన్ని కులుకులు
మురిసిపోవడాలు
బెట్టు చేయడాలు
ఇష్టంగా ముద్దులు
కమ్మగా వంటలు
ఎత్తుకోవడానికి పిల్లలు
ఇదే
ప్రేమ
పెళ్ళి
జీవితం
ఇంతకన్నా ఏం కావాలి
ఒక జీవితంలో
- గస్తీ-
ఆడవాళ్ళకి కావాల్సింది గొడవ పడే మనిషి
అదే రోజు గొడవ పడాలి అనిపించే మనిషి
దీన్నే ప్రేమంటారు అనుకుంటూ బ్రతికేస్తారు
అంటే
ఎంత గొడవ పడితే
అంత ప్రేమిస్తారని
ఇందులో సారాంశం
- గస్తీ-