శివుని మెడలో ఉండే ఆ ఆభరణం అంటే భయం నాకు
అది అలా వయ్యారంగా పాకుతుంటే వణుకు నాకు
ఏ జన్మ బంధమో గాని నన్ను కలలో మాత్రం పలకరించే పరిపాటి తనకు
చూస్తే ఎక్కడ కలలో వచేస్తుందోనని చూపు పక్కకు తిప్పుకునే అలవాటు నాకు
నేను చూసినా చూడకున్నా, నా కలలోకి వచ్చి నన్ను హడల్ కొట్టే అలవాటు తనకు
ఒకసారి చాలా బారుగా, ఇంకో సారి చాలా లావుగా,
అలా అన్ని రూపాల్లో దర్శనము ఇచ్చే అలవాటు తనకు
నా కలలో, నాతో ఫీట్లు చేయించే అలవాటు తనకు
ఎంత భయమైనా నాగిని సీరియల్ చూసే అలవాటు నాకు
అది కూడా భయం లేకుండా నాగినిని చూసే అలవాటు నాకు
కానీ, ఆ పాము అంటే హడల్ నాకు-
బుసలు కొట్టే పాము కన్నా..
ఎదుటివ్యక్తిని చూసి గుసగుసలాడే
మనిషి చాలా ప్రమాదకరం.
...✍️వెన్నెల సీత-
లేని పాము బుసలు కొట్టిందా
తాడులోనా..
భయము గొలిపి భవము పుట్టిందా!
నిశి లోని తాడు పాము
శశి లోనా పాము తాడు
అజ్ఞాన కార్యము భవము దుఃఖము
జ్ఞాన కార్య మానంద మభయము
లేని పాము బుసలు కొట్టిందా
తాడులోనా..
భయము గొలిపి భవము పుట్టిందా!-
పాము స్వభావాన్ని తెలిసి జాగ్రత్తపడతాం!
మనిషి స్వభావాన్ని తెలుసుకోలేక బోల్తాపడతాం!!
...✍️వెన్నెల సీత— % &-
ఓ మనిషీ
కలికాలం ఇది
కాటేసే పాములకే
పాలు పోసి పెంచిపోషిస్తారు
పెంచుకునే కుక్క పిల్లలకన్నా
పెంచి పెద్ద చేసి ప్రోజకున్ని చేసిన
కన్నవారికి విలువ లేదిక్కడ-
కొందరు పాము కుబుసం లాంటివారు..
పాత బంధాలను త్యజించి కొత్తవి కలుపుకుంటూ ఉంటారు.
...✍️వెన్నెల సీత-
పాముకి పాలు పోసి పెంచినా
విషాన్నే చిమ్ముతుంది.
అలాగే మనిషికి నీవెంత
సాయం చేసినా
నీ నాశనాన్నే కోరతాడు.
🐍ప్రపంచ పాముల దినోత్సవం🐍-