తదుపరి ప్రహేళిక ఇవ్వాలని కోరిన నరేష్ గారికి ధన్యవాదాలు...
ప్రతి ఒక్కరికి ఒక్కో వాదం నచ్చి వాటిని అనుసరిస్తారు... అనుకరిస్తారు.. మనం నమ్మిన సిద్ధాంతం నుంచి వచ్చిన వాదం ఒక్క గొప్పతనం అందరికి తెలుపగలరని ఈ ప్రహేళిక ఇస్తున్నాను. అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను.
మీ వాదానికి ప్రహేళిక మరియు నావాదం తగిలించండి.
#నావాదం
సోమవారం విజేత ప్రకటన ...-
మాది మాత్రమే గొప్ప జాతి,
ఎదుటోడికేముంది ఖ్యాతి?
ఒప్పుకోకూడదు,
ఒప్పుకొని తప్పుకోకూడదు
తప్పైనా సరే
తన్ని మరీ వాళ్ళనే ఒప్పించాలి
మేమన్నదే వాళ్ళ నోట చెప్పించాలి..!!
(Read in caption)-
జగతిని నడుపు వాదమేదని
జనులు నడుచు వాదమేదని
నేనడిగితి కలములు కదిలించు కరములను
నాడు నడిపించే భారతిని జాతీయవాదం
నేడు నడుపించు జాతిని ఏ వాదమని
నేనడిగితి కవుల కలము సిరాను
దేవుడని నమ్మినోడిది ఒక వాదం
ఎవడు డేవుడనేతోడిది ఒక వాదం
కడ కులమని నిందించిన వారు నడిచేది
ఒక వాదం.. నిందలు వేసినోళ్లది ఏ వాదం
వేదాలు చదివి వాదనలు జరుపువారిదే వాదం
ఎరుపు రంగు నీడలో నడిచి ఆయుధం పట్టి
పోరు చేయు వారిదొక వాదం...
మనిషిని నమ్మినోడిది ఒక వాదం.
ఎన్నో వాదాలు ... మరెన్నో వివరణలు..
వాద ప్రతివాద ఇజాల నిజాలు ఏవని..
మనిషి మెచ్చిన, మనసు మెచ్చిన వాదమేదని
కలములు కురిపించే నాదములు ఏవని...
ఎదురుచూపు....
-
సోమవారం చివరిక్షణాల వరకు చూసాను. ఇంకెవరు స్పందించరేమో అనుకుని వదిలేసిన క్షణంలో కాస్త ఊరట కలిగించిన కొన్ని వాదాలు.. మెరిసాయి..
సంతోషం... ప్రహేళికలో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు..
తదుపరి ప్రహేళిక ఇవ్వాల్సిందిగా మనసులోమాట గారిని కోరుతున్నాను...-
నా భావం ఆధ్యాత్మికం
నా వాదం ఆస్తికత్వం
దేవుని ఉనికి ఉన్నతం
భక్తితత్త్వమే ఔన్నత్యం
ధర్మపథం మనఆదర్శం
దేవునితోడ సాంగత్యం
కలిగించు మానవత్వం
పునాది దానికి విశ్వాసం
పెంచుకోవాలి తాత్త్వికం
సాగించు సత్యాన్వేషణం
అంతిమం ఆధ్యాత్మికం
సర్వజన శ్రేయోదాయకం
చివరికదే ముక్తిదాయకం
నిరూపణ కందని తత్త్వం-
నేనెవరిని........?????
అభాగ్యురాలైన ఓ అభలని...!
( Read in caption )-
పెరిగిన అహము
కొరవడిన సహనము
నెలవాయె భేదములు
గుర్తించని సత్యములు-