కనులు కావ్యాలై
కవితలు గ కదులుతుంటే
కనుల కాటుక
కలవర పెట్టి కన్ను గీటిన
కాంత నిను కాదనుట నా తరమా..
-
తెలుగున జనించి తెలుగు పలుకులు
తెల్వని తెలివినేర్చిన తెగులు పట్టి
తెలుగు వారని చెప్పుకునుటేలా...
యాస నేర్చిన భాష నీది...
ఆప్యాయత అలుముకున్న యాసనీది..
ఎవడేమంటే నీకేంటి.. తల్లి భాషను
పల్లకిలో ఊరేగించు....
యాస నీ మూలం... భాష నీ పరువు..
భావమెరిగిన భాష నీది.. బతుకు నీడ్చు యాస నీది..
-
జన్మనొంది జగనని పిలవబడుతున్న
తాళిగట్టి మానసకు మనసుచోరుడను
జన్మనిచ్చి ముద్దులచరిష్మకు నాన్నను
అర్థవంతమైన మనుషులకు స్నేహితుడను
అర్థంలేని గుణాలకు వెన్నులో గునపమును
దారిచూపిన వారికి చిరకాల శిష్యుడను
నావ్యక్తిత్వం నచ్చినోళ్ళకు విధేయుడను
మీఅందరి అభిమానానికి సర్వదా ధన్యుడను..
Jagan Gorre
-
సీసాను చూడ శ్రీనాధుని
సీస పద్యముల్ గుర్తెరిగితిని.
సీసాను చూడ కొత్త ఆవకాయ
నోరూరించే రుచుల జాడ..
సీసాను చూడ అమ్మ దాచిన
చిల్లర పోపుల డబ్బా గురుతు..
సీసాను చూడ సూర్యునితో
కాగితం కాల్చిన దోస్తీ..
సీసాను చూడ అనంతాన్ని
అందులో దాచిన నీడ..
సీసాను చూడ అల్లాడిన్
జీని స్నేహం పలుకులు..
సీసాను చూడ ప్రేమరాయభారపు
శివమణి సినిమా కబుర్లు..
సీసాను చూడ శరీరాన్ని
చీల్చినరక్తపు మరకలు...
సీసాను చూడ ఎన్నెన్నో ..
మరెన్నో బంధించిన జ్ఞాపకాల
శూన్యపు మలుపులు...
-
సోమవారం చివరిక్షణాల వరకు చూసాను. ఇంకెవరు స్పందించరేమో అనుకుని వదిలేసిన క్షణంలో కాస్త ఊరట కలిగించిన కొన్ని వాదాలు.. మెరిసాయి..
సంతోషం... ప్రహేళికలో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు..
తదుపరి ప్రహేళిక ఇవ్వాల్సిందిగా మనసులోమాట గారిని కోరుతున్నాను...-
జగతిని నడుపు వాదమేదని
జనులు నడుచు వాదమేదని
నేనడిగితి కలములు కదిలించు కరములను
నాడు నడిపించే భారతిని జాతీయవాదం
నేడు నడుపించు జాతిని ఏ వాదమని
నేనడిగితి కవుల కలము సిరాను
దేవుడని నమ్మినోడిది ఒక వాదం
ఎవడు డేవుడనేతోడిది ఒక వాదం
కడ కులమని నిందించిన వారు నడిచేది
ఒక వాదం.. నిందలు వేసినోళ్లది ఏ వాదం
వేదాలు చదివి వాదనలు జరుపువారిదే వాదం
ఎరుపు రంగు నీడలో నడిచి ఆయుధం పట్టి
పోరు చేయు వారిదొక వాదం...
మనిషిని నమ్మినోడిది ఒక వాదం.
ఎన్నో వాదాలు ... మరెన్నో వివరణలు..
వాద ప్రతివాద ఇజాల నిజాలు ఏవని..
మనిషి మెచ్చిన, మనసు మెచ్చిన వాదమేదని
కలములు కురిపించే నాదములు ఏవని...
ఎదురుచూపు....
-
తదుపరి ప్రహేళిక ఇవ్వాలని కోరిన నరేష్ గారికి ధన్యవాదాలు...
ప్రతి ఒక్కరికి ఒక్కో వాదం నచ్చి వాటిని అనుసరిస్తారు... అనుకరిస్తారు.. మనం నమ్మిన సిద్ధాంతం నుంచి వచ్చిన వాదం ఒక్క గొప్పతనం అందరికి తెలుపగలరని ఈ ప్రహేళిక ఇస్తున్నాను. అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను.
మీ వాదానికి ప్రహేళిక మరియు నావాదం తగిలించండి.
#నావాదం
సోమవారం విజేత ప్రకటన ...-
చిద్విలాసమే చిరంజీవం..
చిలిపితనం చిరుతొడుగు
వేదనలు వేణువై బాధలు రాగాలై
నీ మురళి చేర రంజింపేవు
మమ్ము రాధమయా..
మాయ నీవు.. మాలో మమేకమై
మంచుగడ్డలా కరిగించేవు అహాన్ని..
తపన నీవు.. తన్మయం నీవు
తాండవం నీవు.. తమకం నీవు
తనువున తాపం నీవు..
తెగువ నీవు.. తెల్లారే చీకటి నీవు
తెలిపొద్దు వేకువ నీవు...
తట్టి లేపే సుప్రభాతం నీవు...
తలపై మట్టి వేసే భగవద్గీత నీవు..
-
సనాతన సన్మార్గ దీపిక
సంస్థాగత సంఘటిత రూపిక నాదేశం..
విశ్వమెరిగిన విద్యోదయ వేదిక
పురాతన పునీత పూదోట నాదేశం..
శాస్త్ర సాంకేతిక సంస్కృతి శరీరం
అఖిల జగత్తుకు మూలాధారం నాదేశం..
మరిగిన నెత్తురు, పారిన నీరు, మురిసిన పైరులా
మూర్తీభవించిన ముగ్ధరూపం నా జెండా..
అమరుల త్యాగం, వీరుల ధైర్యం, ధీరుల తేజం
కలగలిసిన నాదేశం పరువు నా జెండా..
దేశసార్వభౌమాధికారం, ప్రజల జాతీయతరాగం
పల్లవించు ప్రగతిరూపం నాజెండా..
అర్థంలేని అజ్ఞాన ప్రతిభమేధస్సుల అప్రతిష్టలు
పులుముకున్న అనాగరిక మేధావుల మొసలి
కన్నీరుల సుడిగుండంలో చుక్కానిలేని నావ నాదేశం.
మతోన్మాదమే మనిషిద్యేయమై, మన సౌఖ్యమే విజయగీతమై మసులుతున్నమహానీయులైన
ప్రబుద్దుల ప్రగతి పతాక రూపమే నాజెండా..
-