Alladi Srujan  
301 Followers · 46 Following

read more
Joined 12 May 2020


read more
Joined 12 May 2020
19 HOURS AGO

ముద్దు ముద్దు మాటలతో ఎందరి మనసు దోచావో
లెక్కపెట్టాలంటే ఆకాశంలో చుక్కలు సరిపోవే
అందమైన అల్లరితో గుండెలెన్ని గాయం చేసావో
కట్టుకట్టాలంటే నేలపైన ఆసుపత్రులు చాలవే
కుర్రాళ్ల స్వప్నంతో సావాసం చేసి
నిద్దుర నరికేయడం న్యాయమా
కలవరింతలతో తంత్రం వేసి
హద్దులు చెరిపేయడం భావమా
లోతైన సొట్టలతో నువ్వలా నవ్వుతుంటే
సుడిగుండాలేగా బుగ్గ సంద్రాలలో
చక్కని పెదాలతో నువ్వలా అంటించావంటే
చిక్కని ఎరుపులే మొగ్గ మందారలలో
ఆకలంటు వేయదుగా నీ తలపు చేరినంతనే
ఒక్కపొద్దులలో
కంటి రెప్ప వాలదుగా నిన్ను చూసినంతనే
జాగారాలలో

-


24 APR AT 11:28

తొలి చూపుతో నాపై వలనేదో విసిరావే
మురిపాల చిన్నది మత్తుగ ప్రేమలో దించావే
అది తెలిసేలోపు నీ లోకంలో ముంచావే
ఇకపై అన్నీ నువ్వే అనిపించేలా చేసావే

అంతేగా ఇంకో ప్రేమ కథ మోదలు
అటుపై కాస్త పెళ్ళి అడుగులు కదులు
మాటలు ఎన్నో మౌనమిచ్చెను బదులు
మనసున ఉరకలు వేసే సంతోషాల నదులు

ఇదేనా ప్రేమంటే తెలుసుకోమంటుంటే
తెలియదే వింటుంటే కలుసుకోమ మనసుంటే
ఇలాంటి కలలుంటే వదులుకోలేమంతే
పట్టుకోవాలంటే విడిచిపెట్టొందంతే

-


24 APR AT 1:17

బాధంటే అసలు తెలియదు
దాని అర్ధం ఏంటో ఎరుగడు
తను చిరునవ్వులతో లేస్తాడు
అవి పంచే పనిలో ఉంటాడు

మంచి మనసున్న అందరి నేస్తం
అపదంటే సాయానికి ఆగదు హస్తం
తేడా చూడక కష్టాల నది దాటించే వంతెన
యోగ్యత తన ఇంటి పేరుగ మార్చుకున్న మంతెన

-


17 APR AT 15:43

తనకోసమే పుట్టాడని ఏనాడో తెలుసుగా సీతమ్మకి
ఎదురుచూపులతో ఉంటుందని ఎవరో చెప్పాల రామయ్యకి
అన్నీ తెలిసీ అందరితో ఎందుకా స్వయంవరం
ముందే ముడిపడ్డ జంట తన తోడు వెతకటం

చూపైనా ఎత్తదు ప్రణయ విల్లు ఎత్తెనతడు
సిగ్గులు దాచిన మనసును కొల్లగొట్టెనతడు
దోసిట తలంబ్రాలు తలపై తారలుగా జారువేల
ఒద్దికైన జానకమ్మ మెడలో మాంగళ్య మాల

వరుడుగ వచ్చెను రామయ్యా
వధువుగా వేచెను సీతమ్మ
సీతారామ కళ్యాణం లోక కమణీయం
పసందైన విందులతో దివ్య వైభోగం
కనులారా వీక్షించగ జనులకు వైకుంఠం

-


14 APR AT 8:57

ఆటుపోటులెన్నెదురైనా పట్టు వదలలేదు
చీదరింపు మాటలెన్ననా చదువు విడువలేదు
అంటరాని వాడంటున్నా అందరివాడై ఎదిగాడు
అల్లంత దూరంపెట్టినా అందరికోసం బతికాడు

మనషులలో తేడాలెందుకని ప్రశ్నించిన గళమది
ఒక్కటిగా చేసేలా రాజ్యాంగం రచించిన కలమది
బడుగువారు బలవంతులుగా నడిపించిన వరమది
సమానత్వముకై ఎక్కుపెట్టి విదిలించిన శరమది

-


9 APR AT 8:08

తెలుగు లోగిల్లన్నీ ఇంటి ముంగిల్లన్నీ
పచ్చ తోరణమయ్యి తెచ్చె పండుగ హాయి
నింగి నేలకు జారి చుక్కలన్నీ చేరి
ముగ్గులల్లే మారి వచ్చే సందడి కోరి

పిందె వయసు దాచింది వగరు మామిడి
చింత పులుపు తెచ్చింది చిగురు తాకిడి
వేప పూత నేర్పింది మనకు చేదు అలజడి
తీపి కలిపి చూడంది బతుకు కొత్త ఒరవడి

లవణాల లాలసలు రంగరించే లాహిరిలోన
మమ'కారం' మాధుర్యం ముచ్చటైన పందిరిలోన
తెలుగునాట విరిసింది తొలి సంవత్సరాది
దోసిలి చాపి ముందు పరిచింది మన ఉగాది

-


28 MAR AT 16:33

సినిమా కవ్వించే మైకం సినిమా నవ్వించే శోఖం
సినిమా మరిపించే మోహం సినిమా ఊరించే లోకం
అందరికీ అందనిది అరుదైన ఆ విజయం
అయినా అటుకై ఆపని పరగులు ప్రతిక్షణం

ఎన్నో కలలతో మరెన్నో కలహాలతో
ఆస్తులు లేకున్నా పస్తులు ఉంటున్నా
అడుగేస్తాము ఆదరణ పొందే ఒక్క ఛాన్సు కోసం
సినిమా చరిత్రలో మాకై మిగిలే చిన్న ప్లేసు కోసం

ఒక్క చూపుకై గంటలకొద్ది నిలబడతారే ఎగబడతారే
అయినా మీ మాటల్లో మాపై చిన్న చూపు పోదే
ముఖానికి రంగులు వేసే రంగవల్లులే మేము
అవసరానికి రంగులు మార్చే ఊసరవెల్లి కాము

-


28 MAR AT 10:41

తనది కాని పాత్రలో తను చేరటం
అంతకుమించి అందులో జీవించటం
ఎవరికి దక్కును అంతటి అదృష్టం
రాసిపెట్టి ఉంటే తప్ప బ్రహ్మ
ఏమని చెప్పి అది వర్ణించటం
దైవంగా కొలిచి పూజించే జన్మ
నేలమీద నడిచే నక్షత్రాలే
తళుక్కున మెరిసే తారాలోకం
తెరదాటి కనిపించాలంటే పుష్కరాలే
మైమరపులు పంచే వేరేమైకం

-


25 MAR AT 9:54

కోపానికి ఎరుపును అద్దిందెవరు?
నమ్మకానికి నీలమని చెప్పిందెవరు?
తెలుపును శాంతిగ ఎగరేసిందెవరు?
నలుపుకు నష్టాన్ని కలిగించిందెవరు?
పసుపును స్నేహంతో ముడివేసిందెవరు?
పచ్చని జీవితమంటు పొగిడిందెవరు?
ఉత్తరాలు దొరికేనా ఎవరెవరోలే అన్న ప్రశ్నలతో మిగిలుంటే
మూలాలు దొరకక మానేనా దాని సంగతేంటో చూద్దాం అనుకుంటే
తూకంలో తూగేనా రంగొకటి చాలనుకుంటే
అనుభవము సరిపడునా ఏ భావం వద్దనుకుంటే
నవరసము కలిసినదే జీవితమంటే
ఏ రుసుము అడగక నడిచేను మనవెంటే

-


25 MAR AT 9:24

చిన్న పెద్ద తేడ లేదు
హద్లు గిద్దు వద్దే వద్దు
రానే వచ్చింది హోళి
రంగులతో ఆడాలి ఖేళి
సమూహమై సమ్మోహనంగా
ఎగరాలి తేలాలి రోజంతా
ఎవరెవరైనా తేడాలు మనకొద్దు
రంగులతో నింపాలి ఊరంతా

సరదాగా తూలీ చెయ్యాలి జాలీ
ఈ అల్లర్లు రావంట మళ్ళీ మళ్ళీ
పొద్దునే లేచీ చేతులని చాచీ
వెయ్యాలి పూయాలి పెట్టక పేచీ
మన అందరిని ఏకం చేసే వేడుక ఇది
ఎన్నో సంతోషాలని పంచే కానుకు ఇది
చిరుజల్లు కురవాలి ఉప్పొంగే మది
హరివిల్లు చేరాలి నేలమ్మ ఒడి

-


Fetching Alladi Srujan Quotes