QUOTES ON #నటన

#నటన quotes

Trending | Latest
16 FEB 2019 AT 11:05

ఎవరి మీదైనా సరే లేని ప్రేమని నటించకండి,
మీది నటన కావచ్చు కానీ ఎదుటి వారిది జీవితం..

-


13 SEP 2020 AT 22:45

రాసిన కథల్లో నటించేవారికి
రాయని కథల్లో జీవించేవారు అభిమానులు..!!

-


19 JUN 2018 AT 0:47

పెదవిన చెదరని చిరు దరహాస౦
అ౦తర౦గాన అ౦తు చిక్కని అగాధం
మది లోతుల్లోకి తొ౦గి చూస్తేనేగా
మగువ మది మదన౦ తెలిసేది
కనిపి౦చే౦త ప్రశా౦త౦ కాదు ప్రతి ఒక్కరి జీవితం
నవ్వుని బట్టి సంతోషంగా ఉ౦దనలే౦...
నటి౦చాల్సిన కర్మ కర్తవ్యంలా నిలిచే క్షణాలు కోకొల్లలు కొ౦దరి
జీవితాల్లో...
మనస్ఫూర్తిగా నవ్వుకుని తృప్తిగా ఒక్క నిమిష౦ గడిపితే చాలనిపిస్తు౦ది.... అదే ఆ ఒక్క క్షణ౦ మన వల్ల ఇ౦కొకరు పొ౦దగలిగితే అ౦తకన్నా మాధవసేవు౦డదు అనుకు౦టా

-


4 JUN 2018 AT 1:03

ఇతరత్రా ఆలోచనలతో మనసుని,మెదడుని ఎ౦త సతమత౦ చేసి నీ తలపు ను౦డి లాగేద్దామన్నా వీలుపడట౦ లేదు
బాగానే ఉన్నానని నటిస్తూ నటిస్తూ కృత్రిమ నవ్వు పూయి౦చాలని తెగ ప్రయత్నిస్తున్నా కాని
హఠాత్తుగా........ గు౦డె చాలా అ౦టే చాలా బరువెక్కిన భావ౦
తనుభార౦ క౦టే హృదయభార౦ ఆ క్షణాన అ౦తగా పెరిగిపోతుంది...ఒ౦టరినన్న ఆలాపన.....ఎలా బ్రతకాలో తెలియక ఆ౦దోళన.....నా ప్రమేయం లేకు౦డానే నా కళ్ళు చెమర్చే ఘటన... ఈ వేదనతాకిడి తాళలేక ఊహలోనే పరిగెడుతున్నా..ఊహె౦త అదృష్టవ౦తమైనది కనీసం వేదనకి జ౦కి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది... కాని తనువుక౦తా స్వేచ్ఛ లేక తనము౦దున్న తరుణాన్ని దాటలేక ఎదుటివారికి వెల్లడి౦చలేక ఈ బాధాభారన్ని మోయలేక చిత్రవద అనుభవిస్తు౦ది ఇ౦తలా నలిగిపోతున్నా నటించడం మాత్రం యధావిదిగా కొనసాగిస్తు౦ది నామదికి పాదాభివందనం చేయాలను౦ది నాది చాలా సున్నితమైన బలహీన మది అనుకు౦టూ ఉ౦టా కాని తను నిరూపిస్తు౦ది ఈ చిత్రమైన చిత్రవదని అ౦తర్గత చిత్ర౦గా ప్రదర్సిస్తూ చూసే కనులకి తెర మూస్తు౦ది...ఎ౦తైనా నా మది కదా అలవాటు పడి౦ది కదా
తనేగా నా తోడు...

-


19 MAY 2018 AT 22:15

నటించడం తెలియదంటే ఎలా
మోసపోకుండా ఉండాలంటే గడుసు తనం నటించాలి
చులకన అవకూడదంటే కొంత వివేకం నటించాలి
ఆకతాయిల ఆటలు కట్టించాలంటే ధైర్యం లేకున్నా నటించాలి
ఓడిపోకూడదనుకుంటే ఆత్మ విశ్వాసం నటించాలి
అహంకారుల నోరు మూయించాలంటే
కొంత పొగరు కూడా నటించాలి...
నాటకీయ పాత్రల నడుమ జీవించాలంటే ఎంతైనా కొంత నటించాలి...

-


5 MAY 2018 AT 12:03

ఏంటి...
జీవితమే ఓ నాటకం... కాదు కాదు
ఆ దేవుని జగన్నాటకం ...
జనులంతా పాత్రదారులు ,ఆ పైవాడే అసలు సూత్రధారి ...
లాంటి నగ్న సత్యాలు చెప్తూ
ఏమీ ఎరగనట్టు మొహం పెట్టాలా
నా వల్ల కాదు...

ఈ హంగుల ప్రపంచంలో
రంగులు మార్చకుంటే బతికేదెలా ..
నొప్పించక తానొవ్వక బతకాలంటే
తప్పదుగా నటననే ఓ కళ ...

అందని చందమామను చూపించే
ఆ అమ్మది నటనే ...
ఏనుగమ్మ ఏనుగు అంటూ తానే ఏనుగల్లె ఆడించే నాన్నదీ నటనే ..
అక్షరాలు నేర్పాలని పంతులమ్మ చూపే కోపం నటనే ...
బడికెళ్ళనని పసివాడు ఏడ్చే కడుపునొప్పి కూడా ఓ నటనే ...

ప్రేమను చూపాలన్నా,ప్రేమను పొందాలన్న తప్పనిది కూడా నటనే ...

కష్ట జీవుల రక్తమాంసాలను దోచుకునే మాయగాళ్ల నటనల ముందు ....
హృదయాలను దోచుకుని పదిలంగా దాచుకునే చిన్న చిన్న నాటకాలు రమణీయమే ఇలలో ...

Sandhya. Ch

-


5 FEB 2020 AT 14:18

నీకు నచ్చింది మాత్రమే మాట్లాడే వాడెపుడు,
నీ ముందు నటించే వాడే అవుతాడు..!!

-


25 FEB 2019 AT 17:29

నటనని ప్రేమించొచ్చు
కానీ ప్రేమని నటించకూడదు

-


5 MAY 2018 AT 17:08

జీవితంలో నటిస్తున్నామా
నటిస్తూ జీవిస్తున్నామా
ఏదేమైనా జీవించాలంటే కొంత నటించాలి
కొన్ని సార్లు మన కోసం
ఇంకొన్ని సార్లు సంఘం కోసం

-


5 DEC 2020 AT 13:07

లేని ప్రేమ చూపకెపుడు
ఉన్న ప్రేమ దాచకెపుడు
నమ్మినోళ్ల మనసుతోటి
నటనలతో ఆడకెపుడు

-