కొన్నిసార్లు పెదాలు,
పదాలు పలుకలేని భావాల్ని...
జోడించిన చేతులు,
చెమర్చిన కళ్ళు తెలుపుతాయి...-
నేను రక్తం ఇచ్చింది ఒక
గిరిజన యువతికి
రక్తం కోసం ప్రయత్నించిన
ఆమె స్నేహితురాలు
ఒక ముస్లిం
నన్ను కాంటాక్ట్ చేసిన వైద్యుడు
ఒక క్రైస్తవుడు
ఇక నేను
ఒక హిందువు
ఇది నా భారతదేశం🇮🇳🤗-
రక్తదానం చేసినోడి కంటే
రక్తపాతం సృష్టించినోడికే
పబ్లిసిటీ ఎక్కువ సామీ.🤘-
రుధిరజ్యోతి!?
ఏ రుధిరజ్యోతి గురించి రాయాలి?
రక్తదానం చేసి కాపాడిన రుధిరం గురించా!
పరువు హత్యల్లో ఏరులై పారుతున్న రుధిరం గురించా!
సైనికుల శవాల గుట్టల్లో పేరుకుపోయిన రుధిరం గురించా!
సమాజపు వెలివేతకు బలౌతున్న నెలసరి రుధిరం గురించా!
మానవ మనుగడకు కారణమైన బొడ్డుకోత రుధిరం గురించా!
మానవత్వాన్ని మంటగలుపుతున్న మానభంగపు రుధిరం గురించా!
రుధిరజ్యోతెక్కడ వెలుగుతుందో తెలియక ఇంకా వెతుకుతూనే ఉన్నా.🤘-
అవసరంలో చేస్తే
కనుక రక్తదానము
ఉండదులే ఎపుడూ
దానికి మించిన సాయము
అద్బుతమే రక్తదానం
చేసినోళ్ళు దైవసమానం
-
రక్తదానం చేయండి, చేపించండి
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి
ప్రాణం పోయండి
ఎందుకంటే మనం దానం చేసే
ప్రతీ "రక్తపు బిందువు"
మరొకరికి ప్రాణం పొసే "అమృతబిందువు"
PLEASE READ IN CAPTION-
రక్తం
ఇవ్వడానికే పుడతారు
కొందరు
రక్తాన్ని
పీల్చడానికే పుడతారు
మరికొందరు-
ప్రాణాన్ని పోసేందుకు
వైద్యుడే అవ్వాలా
రక్తదాతగా నువ్వు
మారితే సరిపోలా..!?
వారెవ్వా రక్తదానం
నిలబెడుతుంది నిండుప్రాణం
-
జోకులు, విద్వేషాలు, వదంతులు, తీర్పులు,
అభిప్రాయాలు ఫార్వర్డ్ చేయడానికి ఇష్టపడినంతగా
రక్తదానం/మంచి కోసం వచ్చే విన్నపాలనూ, అవసరాలను
ఫార్వర్డ్ చేయడానికి చాలా మంది అంతగా ఇష్టపడరు
సమాజాన్ని తప్పు పట్టకు,
సమాజాన్ని సరిగ్గా అర్థం చేసుకోనందుకు నిన్ను నువ్వు తప్పుపట్టుకో.🤘-
మనం మెచ్చేది వర్ష ఋతువు
దోమలు మెచ్చేది మన రుధిరం
(ఉపశీర్షికలో 👇)-