మగువ బ్రతుకు వెలిగించిన భవిత జాడ గురజాడ
వెలుగు పథము నిర్మించిన అడుగు జాడ గురజాడ
వనిత స్థితి మార్పు కోరి కలము కదిపె హేతువాది
స్త్రీ పక్షం సాహిత్యం రచన జాడ గురజాడ
ఈ సంఘం సంస్కరణం శ్రీ"శ్రీశ్రీ కవిత్రయం
పరివర్తన పల్లవించు ప్రగతి జాడ గురజాడ
రైతు యజ్ఞ శ్రమను చూసి చేయి కదపి సాగాలను
సమైక్యతా సహకారం నడక జాడ గురజాడ
ఉర్వి కులములన్ని కలిపి రెండు చేయు చరిత తనది
మంచి చెడులె లోకమన్న పలుకు జాడ గురజాడ
మతములన్ని మాసిపోయె లోకమేదీ? వన్నెలయ్య
కాంతి చూపే అక్షరాలే కవిత జాడ గురజాడ-
గుండె సడేమో పెరుగుతోంది
ఏదో తలపే మెదులుతోంది
ఏమాయ చేసావే చెలీ
రూపు వీడకుంది
-
గురు(ర) జాడ
అడుగు జాడలు
అభ్యుదయ
వెలుగులు
(Read in caption...)-
✍️✍️✍️గురజాడ ✍️✍️✍️
సీ//ముచ్చటగాకూర్చిముత్యాలసరములు
తెలుగు భాషకు నింపెతేజమెంతొ
గిడుగుతోడకలసి అడుగుజాడగనడ్చి
భాషోద్యమానికి పట్టునిచ్చె
కఠినకన్యాశుల్కకార్చిచ్చునార్పంగ
నాటకమునురాసెతేటగాను
దేశమంటే మట్టి దిబ్బలుకాదంచు
మనుషులంచున్ భక్తిమహినిసాటె
తేగీ
చిన్నకథకుతావన్నియలెన్నొయద్ది
ఛందమందునిలిపికొత్తయందములను
వ్యావహారంబునకుకట్టిపట్టము తను
వేగుచుక్కగా తెలుగున వెలుగునింపె-
✍️✍️✍️✍️గురజాడ ✍️✍️✍️✍️✍️
సీ Il
చిన్నకథకుమరిచిరయశమును గూర్చ
దిద్దుబాటుకథ ప్రతీతికెక్కె
వాడుకభాషకు వేడుక కూర్చగ
కన్యాశులకమునఖ్యాతికెక్కె
పుత్తడి బొమ్మగుపూర్ణమ బాధను
గేయముగ మలచి కీర్తికెక్కె
కన్యక వొందినకన్నీటిగాథను
ఖండికగాకూర్చి గణుతికెక్కె
తేగీ
భావమందున నవ్యత వ్యక్తమవ్వ
భాషలోన సారళ్యము ప్రస్ఫుటింప
తెలుగుభాషనందుననింపివెలుగులెన్నొ
తెలుగు జాడగ గురజాడ వెలుగునొందె-
జాడ జూపినారు జాగృతి చేసిరి
గురిగ నిలచినారు గురువు వోలె
గురువు వందనములు గురజాడ తమరికి
అడుగు జాడ మీది అనుసరింతు-
సీసము //
ముచ్చటగాకూర్చిముత్యాలసరములు
తెలుగు భాషకు నింపెతేజమెంతొ
గిడుగుతోడకలసి అడుగుజాడగనడ్చి
భాషోద్యమానికి పట్టునిచ్చె
కఠినకన్యాశుల్కకార్చిచ్చునార్పంగ
నాటకమునురాసెతేటగాను
దేశమంటే మట్టి దిబ్బలుకాదంచు
మనుషులంచున్ భక్తిమహినిసాటె
తేగీ
చిన్నకథకుతావన్నియలెన్నొయద్ది
ఛందమందునిలిపికొత్తయందములను
వ్యావహారంబునకుకట్టిపట్టము తను
వేగుచుక్కగా తెలుగున వెలుగునింపె-
ఒకప్పుడు:
దేశమంటే మట్టి కాదోయ్,
దేశమంటే మనుషులోయ్.
ఇప్పుడు:
దేశమంటే మనిషి కాదోయ్,
దేశమంటే డబ్బే కదనోయ్.-
ఆవె
అడుగునడుగులోన నాంధ్రత్వమలరంగ
పలుకు పలుకు లోన ప్రతిభమెరయ
కవితకథలు కమ్మగారాసి గురజాడ
తెలుగు వెలుగులన్నిదిశలనింపె-