సీ
అస్పృశ్యతారని కార్చిచ్చుఁగాలుచు
కైతలనల్లిన కవియితండు
కన్నీటిసంద్రాన కడుమున్గి కావ్యంపు
ముత్తెములనిడిన బుధుడితండు
చీత్కారములనెల్ల సత్కారములుగాను
మలచుకు సాగిన మాన్యుడితడు
ఖండకావ్యపు కలకండ చక్కెరలను
విరివిగ పంచిన విబుధుడితడు
తేగీ
వర్ణభేదాలపై తిర్గు బాటుచేసి
ధర్మ యుద్ధము చేసిన ధైర్యశాలి
సర్వజనసమానత్వమున్ సతముకోరి
విశ్వనరునిగాజాషువా వినుతికెక్కె
Dr Pranisad-
ఆవె
కాసులున్నవంచు గర్వంబు వహియించి
దానహీనుడగుచుతనరరాదు
విత్తమేమిధరనునిత్తెముకాదయ
పుణ్యమొకటెనిల్చు భువనమందు-
సీ//భారతీదేవికి మంజుల భూషయై
మహిలోన పాటిల్లు మధుర భాష
ఆసేతుహేమాద్రి యావతు భారత
మంతటరాజిల్లుఅమృతభాష
సూరదాసు రహీము సుందర దోహేల
హేలతో భాసిల్లు హృద్యభాష
జాతీయభావాలు జనులందుచాటంగ
తీయగసాగుజాతీయభాష
గీతసంగీతగేయాలఁబ్రీతినిడుచు
కమ్మనైన కహానీలఁ గలకలిసియుయు
శృతిశుభగమయ్యిసతతము చెలగుచుండి
యింపుగధరను వర్ధిల్లు హిందిభాష-
ఆవె
దివ్య మంగళకర దేదీప్యమానమై
సతతమువెలుగొందు సాధురూప!
పాపతాపములను బాపి పుణ్యజలము
చిలుకరించ రావ శ్రీనివాస!-
ఆవె
వారపక్షమాస బ్రహ్మోత్సవంబాది
నిత్యపూజలందు నీరజాక్ష!
నిఖిలశుభములకయి నీసేవఁజేతుము
స్థితిని కూర్చు మయ్య శ్రీనివాస!-
ఆవె
చెలువుమీఱు సతులు శ్రీదేవి భూదేవి
చెంతజేరినీదుసేవజేయ
కొలువుదీరియున్న కోనేటిరాయడ!
సిరులనొసగుమయ్య శ్రీనివాస!-
ఆవె
విశ్వమందెచటను వెతకి శోధించిన
వేంకటాద్రిఁబోలు వేల్పుతలము
దేవ! నీకుసాటి దేవాదిదేవుండు
క్షితిని లేడురాడు ! శ్రీనివాస!-
తేగీ
మరిగినజలమే మబ్బుగా మార్పునొందు
కడలి కెదురొడ్డిన పడవ గట్టుజేరు
పృధ్విఁజీల్చియె మొలకెత్తు విత్తు భువిని
కఠినకష్టాలుదాటిన కలలుతీరు-
తేగీ
పురిటినొప్పులకోర్చకపురుడురాదు
కడలి కెదురొడ్డిన పడవ గట్టుజేరు
పృధ్విఁజీల్చియు మొలకెత్తు విత్తు భువిని
కఠినకష్టాలుదాటిన కలలుతీరు-
ఆవె
ఏటి గట్టు మీద తాటిచెట్టున వ్రేలు
ముచ్చటైనకాయ ముంజకాయ
కన్ను కన్నులోన కమ్మని రుచికల్గి
తినిన మేని తీండ్ర తీసివేయు-