గమ్యమెమో పిలుస్తుంది
నమ్మకం నడిపిస్తుంది
ధైర్యం తోడుండుగా
విజయమే వర్షిస్తుంది
-
9 OCT 2020 AT 19:24
23 JUL 2021 AT 1:44
పగలంతా గుర్తురాదు
రాత్రైతే విడిచిపోదు
అదేంటో మరి ఆమె...
నాకెపుడూ అర్థమవదు-
5 JUN 2021 AT 19:43
కంటనీరు రుధిరమైంది
కలలకోట శిథిలమైంది
చెలి విడిచిన జ్ఞాపకమే
హృదయాంతర కదనమైంది-
5 JUN 2021 AT 20:10
కవిత్వమే ఊపిరవగ
స్పందనలే హాయివ్వగ
ప్రాణంతో పనేముంది
నా రాతలు అమరమవగ-
2 AUG 2020 AT 16:43
మరోజన్మ లేదులే
ఈ క్షణమే నీదిలే
బాధలన్ని నీకేనా
బ్రతికున్నావ్ చాలులే-