కుదుళ్ళు మెత్తబడ్డ భూమి మిగిలే ఉంది
పెరగాల్సిన చనువులు చెమ్మగిల్లాయి
మరో కాలాన్ని ఆశించిన నిరాశ స్థాయి
లోలోపల పూర్తిగా సద్దుమణిగిపోతోంది
పొరలైన సంకోచం ఇప్పుడు శాసించలేదు
పొద్దు పొడిచే ఏకాంతం నన్ను దాటిపోలేదు
భర్తీ చేస్తున్న ఆరాటానికి చివరి ఘడియలు
నన్ను నా నుంచి వేరుచేయ, పట్టుబట్టిన
ఆటంకాన్ని మోహరించిన నా మనసుకు
జోహార్లు! నిడివి లేని బ్రతుకుతో జోహార్లు!!-
ఎప్పటికీ చెరిగిపోని అపురూప అక్షరాలు
అక్షరాల్లో అమరిన అందమైన ఆ... read more
సరితూగని సంబంధాలకే
ప్రతీసారీ సాక్ష్యాలు కావాలి
నువ్వంటే ఏమిటో తెలియనివాళ్ళకే
మళ్ళీ మళ్ళీ నమ్మకం కలిగించాలి
నిన్ను నువ్వు పురోగమించేలోపు
ఎన్ని యుద్ధాలు జరుగుతాయో!
ఎంత కాలం అలలైపోతుందో!
ప్రశ్నలకు తావివ్వని ప్రేమనే ఎన్నుకో
హుందాగా గుండెకు అదుముకో
ప్రోత్సహించే పరిపక్వత
మనసైన వేళే శుభ ఘడియ కదా!-
దట్టమైన అడవి తల్లి చేతుల్తో
ఆకు పచ్చని కవితలు పరిచిందట
పోయి చదివేసి మళ్ళీ నా దగ్గరకే రా
ఎర్రటి సూర్యుడు సాయం సంధ్యలో
చంద్రుడి నుంచి చల్లదనాన్ని ప్రసరిస్తాడట
మండిపోయిన నీలిరంగువై హుందాగా రా
ఒంటరి రాళ్ళు మీద పడితే
జంటగా కన్నెర్ర జేస్తూ చూడాలట
చూపుల లోతుతో గుణపాఠం చెప్పేసి రా
మందార పువ్వుల మాటలు
ఆరుద్ర రాతల బాటలవ్వాలట
వెన్నెల నిండిన ప్రకృతితోనే తిరిగి రా
అక్షరాలను ఆరబోసిన కళలను
మానవతా కలలతో సంధికుదర్చాలట
మేధస్సును ధనుస్సు చేసి మనసారా రా
నీకు నచ్చిన ఆ ఎర్రజెండాని
నేను రోజూ హత్తుకుంటుంటా
నేనొరిగిపోయే ఘడియలోపే ఎగిరే జెండావై రా-
ప్రకటనల మీద ప్రకటనలు
అక్షరాలు చెరిగిపోవని
ఆకాశం విరిగిపోదని
స్వేచ్ఛ చెదిరిపోదని
స్ఫూర్తి ఒరిగిపోదని
ఖాళీ కూర్చీ కొత్తపాఠం
మళ్ళీ మళ్ళీ నినాదిస్తుందని
ప్రకటనల మీద ప్రకటనలు
నేను ఏడవలేదు
నిలుచున్న చోటునే
విప్లవ జోహార్లు అర్పించాను✊🌺-
నువ్వు నేను ఓ సంగీత దారం
కట్టబడిపోయాం
ఆ సముద్ర తీరానికి కట్టుబడిపోయాం
నా పెదాల మీద నుంచి
గుండెల మీదకు జారిన ఆ జావళి
నీ చిరు చెంపను తడిమిన గురుతు
ఏ వాయిద్యానిదంటే???
కళ్ళు మూసుకుని నిలబడిపోదాం
కాలమే కవ్వింపు కవితొకటి
మన కోసం మరలా రాసి పోతుంది-