"శ్రీ"గంధపు సౌరభానివే
"ల"క్ష లలనల్లో లావణ్యవతివే
"త"లుక్కుమనిపించే త్రిలోకసుందరివే-
కవితలు అల్లే కవి
వెలుగులు వీడని రవి
కాంతులీనెను భువి
ఓ కూనలమ్మ!-
ఉరుముకి ఉలికి జడివాన జోరుకి జడిసి
తనువు మాటున తనయను దాచెను సారిక-
చేతిలో అన్ని పండ్లు ఉన్నాయి,ఆశగా వాటి వైపే చూస్తున్న చిన్నపిల్లకు ఓ పండు ఇద్దామని కవరులో దూరిన చెయ్యి,ఆ పని చెయ్యలేకపోయింది.. మార్పును ఎవరో అడ్డుకున్నారు?
మండుటెండలో బండి మీద వెళ్తున్నప్పుడు అల్లంత దూరానా ఓ ముసలాయన లిఫ్ట్ అడగుతుండడం గమనించినా? బండిని slow చేసానే గానీ ఆపి ఎక్కించుకోలేకపోయాను..మారే అవకాశం చేజారింది.
బండెడు చాకిరీ అమ్మ ఒక్కతే చేసుకుంటోంది..
ఈరోజు కొంచెం సాయం చేద్దామన్న ఆలోచన అడుగు వేయలేకపోయింది..మళ్ళీ అదే ఏమార్పు!
కులమేంటి? మతమేంటి? మనిషి కంటే ఇవి రెండూ గొప్పా ఏంటి? అని బిగిసిన పిడికిలి సడలిపోయింది..మార్పంటే ఎంత భయం?
ఓటమేంటి? గెలుపేంటి? ఓ సారి ప్రయత్నిస్తే తప్పేంటని బయలుదేరిన తెగింపు ఆరంభంలోనే ఆగిపోయింది..!
-
కవి తానుచూస్తు మనకు చూపుతారు
తాను చూపే పాత్రలో మనల్ని లీనంచేస్తారు
దూరంగా వుండేవాటిని మనస్సుతో దర్శిస్తారు సృజనాత్మకతో కవనసృష్ఠి పండిస్తారు తన హావ భావాన్ని కథశిల్ప నైపుణ్యాన్ని తెలుపుతారు భాషశైలిని అందంగా వ్యక్తీకరిస్తారు రవి చూడనిది కవి కాంచగలడు-
మనిషి రాలేని తీరానివో
మనసు తేలేని భారానివో
కలలు కోరేటి దృశ్యానివో
కనులు కార్చేటి కన్నీరువో-
నీకు తనకు నడుమ తాను
తాను తనకు నడుమ నేను
ఎవరి తీరు వారి మతము
ఎటుల తెలియు వారి వారి
మతము వెనుక హితము హరా!-