QUOTES ON #ఆటవెలది

#ఆటవెలది quotes

Trending | Latest
23 JUL 2019 AT 8:57

పాలపుంత దాటి పాకగలడు నరుడు
జన్యు మార్చి కూర్చె జ్ఞాన బలుడు
కుప్పకూలి కూడ కులము నొదలలేడు
కులము లోన యేమి గుణము గలదు!

-


22 MAY 2020 AT 10:27

*** ఆటవెలది ***

నీదుయున్న విద్య నిక్కముగన్ జూపు
వినుడువారి వరస విడిచిపెట్టు
కోయిలమ్మ కూత కోరునా శ్రోతనే
చెప్పెను రవివర్మ ఒప్పు వినుమ

-


12 MAY 2021 AT 19:13

ఆ.వె:
చిటికెనేలి మీద శిఖరమంతటినెత్తి
తులసి దళము వేయ తూగినావు
నీదు లీలలెంత నిత్య నికరమయ్య
జీవకోటి శ్వాస శ్రీనివాస

-


21 APR 2021 AT 9:17

సీతనగ్నికంపె శీల పరీక్షకన్
జనుల మాట చేత జానకిపతి
మనసునెంత నొచ్చె మనషులకెరుగునా.!?
చెప్పెను రవివర్మ ఒప్పు వినుమ...

-


9 MAY 2021 AT 1:23

ఆ.వె:
అమ్మతనము నందు నాదిశక్తి నిలుచు
జనని లేక నీకు జన్మ యేది?
అమ్మ నిదుర లేవ యవనికిర్లు విడుచు
జననిలేని వేళ జగతియేది?

-


19 JUL 2020 AT 22:27

సొమ్ము కొరకు చాటు గమ్ముకొనిరిమందు
చావు బ్రతుకు లన్న జాలి లేక
పంట దాచి రైతు పస్తులుంచ గలడె
నీతిగల్గిమనుజ ఖ్యాతి గెలువు

-


20 JUL 2021 AT 1:31

తనకు నచ్చు తిండి తాను తినగనునూ
పక్కవానిదెంచు తిక్క నరుడు
అన్నమందు గాదు ఆత్మనుండున్ బుద్ధి
చెప్పెను రవివర్మ ఒప్పు వినుమ

-


11 AUG 2020 AT 23:54

మిత్రుడైన వాన్కి మిక్కిలిగిచ్చె సిరి
మామయైన గాని మట్టుబెట్టె
ఎన్ని వింతలుగద కన్నయ్య మాయలన్
చెప్పెను రవివర్మ ఒప్పు వినుమ

-


2 APR 2020 AT 21:46

చుక్కలంటుచు మరి లెక్క తప్పుచు నేడు
బయట కొచ్చి కరొన భయము నింపె
నవ్వి పోదురయిన నాకేటి సిగ్గంటు
జడలు విప్పి ఉరికె జాఢ్య కణము

-


29 MAR 2020 AT 0:00

ఆటవెలది
కఠిన రాతి గుండె కర్రొనా రక్కసి
బయట తిరిగి దాని బారి పడకు
మందు మాకు లేదు మందలించినపోదు
మాట వినక మనకు మనుగడేది?
సుమనప్రణవ్

-