Chandra Mouli  
866 Followers · 95 Following

read more
Joined 10 December 2017


read more
Joined 10 December 2017
29 DEC 2022 AT 12:45

భావాలను వ్యక్తీకరిస్తేనే బలపడతాయి.
మనసులో పుట్టిన భావాలను మనసులోనే పొదువుకుంటూ పోతే నీటి కెరటాల్లా అభేదంగా మెరిసి మనస్సంద్రంలో మునిగిపోతాయి.
మనసు దాటి మాటగానో పాటగానో పొంగిపోతూ వస్తే, బడబానలాల్లా విలక్షణంగా వెలిగి భావద్వీపాలుగా మిగిలిపోతాయి.

-


29 OCT 2022 AT 22:00

ఒక శిల్పి శిలను చెక్కుతున్నపుడు, ఉలికీ శిలకూ నడుమ జరిగే ఘర్షణకు అద్దం పట్టేవి - ఎగిరిపడే నిప్పుల రవ్వలు, ఎగసి వచ్చే లోహపు రవములు.
రవివర్మ రచనలను పరిశీలిస్తే అలాంటి రవ్వలూ, రవములూ స్ఫురణకు వస్తాయి.
అంటే, ఒక కళ రూపుదిద్దుకుంటున్నపుడు జరిగే ఘర్షణను పోలిన అభివ్యక్తి తనలో ఉంది. అందుకని ఏ విషయం చెప్పినా అది తీక్షణంగా ఉంటుంది.
తన రచనల్లో శబ్దసౌందర్యం కన్నా భావ ధ్వని కన్నా రసధునికి ఎక్కవ ప్రాధాన్యత కనబడుతుంది. విశ్లేషణా శక్తి విరివిగా విశదపరుస్తూ మానవ మౌలిక భావాలకు,
చిన్ననాటి చందమామ సారాలకు, సమకాలీన సాంఘిక అంశాలకు, పఠం కట్టి ప్రదర్శిస్తాడు. నిర్దుష్టత, స్థితప్రజ్ఞత లాంటి ఎల్లలను చెరిపి - అపారమైన సహజ స్పందనతో చేసే అనూహ్యమైన భావావేశ కవనం ఆకట్టుకుంటుంది. ప్రక్రియను ఒడిసిపట్టుకుని కవిత్వం రాయడంలో విశిష్టమైన చాకచక్యం కనబరుస్తాడు. పడికట్టు పదాలు, వాడి వాడి అరిగిపోయిన పదబంధాలు ఉండవు. అనవసరమైన అంత్యప్రాసలు అసలుండవు. పదునైన మాటలు(అంటే చుక్క రక్తం లేకుండా చీల్చి చెండాడగలిగినవి) కూర్చి తన భావాలకు వత్తాసుగా సమస్త ప్రకృతిని నిర్దేశించగల కవి.
నిలకడ ఉన్న చోట గుర్తింపు దానంతటదే వస్తుంది.
ప్రతి రోజూ పొడిచే పొద్దుకి ప్రచారం అక్కరలేదు కదా!

-


9 DEC 2020 AT 17:25

అనురాగము కోరుకుంది
ఒదగలేని భావమేదో
ఎద నిండా చూరుకుంది

-


29 MAR 2020 AT 16:38

భావ సౌందర్యం చుట్టూ ప్రాసల పరదా కట్టెనేమో
భావుక పరిమళం పదవిన్యాస భరిణలో పట్టెనేమో
సరళ సాహిత్యం చిత్తలాలసల వలయంలో చిక్కెనేమో
హృదయ లాలిత్యం దేహస్థాణుత్వ శిబిరంలో నక్కెనేమో

-


5 MAY 2018 AT 17:26

బొడ్డుకోసుకు నేలరాలిన బాల్యమెంత అపురూపం
ఇదేగా మన రసమయ జీవనరంగానికి అరంగేట్రం

ఎదుగుతూ ఈ కథను మనమే రచించుకుంటూ,
మనమే పాత్రధారులమవుతూ నవరసాలు పలికిస్తూ
నాటకానికి జీవం పోసి జీవానికి నటన నివేదిస్తాము.

అరుదైన వారిని గౌరవిస్తూ, అలుసైన వారిని విసుక్కుంటూ
మనసైనవారితో మురిపాలు, సఖులైన వారితో సరసాలు
నవ్విస్తూ నవ్వులపాలవుతూ, నినదిస్తూ నీళ్ళు నములుతూ
కోపములో ఎర్రబోయి, అంతట్లో తెల్లబోయి
అభాగ్యులనాదుకుంటూ, ఆపదల్లో కృంగిపోతూ
విరుచుకుపడి కూలబడుతూ మళ్ళీ లేచి నిలబడుతూ
అద్భుతాలను ఆవిష్కరించి, శాంతిని వెతుక్కుంటూ

కడకు కొనఊపిరి అందుకోబోయి విరామమందుకున్న
ఈ జీవితమెంత రమణీయం, ఎంత స్మరణీయం.
తెరదించిన ప్రతిసారి ప్రశంశలు, జేజేలు,
అందలం ఎక్కించి ఊరేగింపులు.
నిత్య ఆదరణీయం కదూ ఈ నాటకం.

-


14 APR 2018 AT 12:35

స్త్రీకి మీరు ఇచ్చే గౌరవానికి
నిర్వచనం ఏంటి అని అడిగితే,
స్త్రీ మాకు దేవతతో సమానం,
ఎందరో దేవతలకు గుళ్ళు కట్టాం
అని లౌక్యంగా చెప్పాడతడు.

దాని అర్థం, స్త్రీ ఇలా ఉంటేనే గౌరవం ఇస్తాడని-
(Read in Caption)

-


24 MAR 2018 AT 17:11

నిత్యం జీవన ఢంకా బజాయిస్తున్న
నా గుండె కలములో ఉఱ్ఱూతలూగుతు
ప్రవహిస్తున్న ఎర్రని సిరా చుక్కలు నాతో
పలికెను గళం విప్పుతూ నిజం కక్కుతూ,
"విశ్వీకరణల పరిష్వంగమున ఊపిరి
సలుపక ఉక్కిరిబిక్కిరి తటతటల్లో
కమ్మరి కుమ్మరి మగ్గరి దర్జీ ఇంకెందరో
పరితపిస్తూ అలమటిస్తూ బ్రతుకజూస్తూ
నిగ్గదీసి అడిగిన ప్రశ్నలు ప్రతిధ్వనిస్తుంటే,
ఇక ముహూర్తమెందుకు మీమాంసలెందుకు
పంచభూతములు శంఖము పూరించె
సమర నినాదం విప్లవమేనని గీపెట్టుతు
పద పద పరుగిడు ప్రగతికి పరుగిడు,
సమాజవాదం సాంఘికతత్వం
ద్యుతికొల్పేందుకు నెలకొల్పేందుకు"

-


14 MAY 2021 AT 7:40

కారణాలూహించడంలో కాలయాపన
చేయని చురుకుదనం లోకానిది.

-


13 MAY 2021 AT 23:02

రోజంతా మనుషులతో రిడండంట్ సావాసం
అనాసక్తి పులిమిన హావభావాలతో రాపిడి
వడలిపోయిన ముఖోత్పలమును
యామిని దయతో తన దోసిట్లోకి తీసుకుని
చల్లని చుక్కల తుంపర్లతో మోమంతా తుళ్ళింతపరిచింది
పగటి పలకరింపుల వలన ఏర్పడిన కల్మషాలను కడిగేసింది
తారా కాంతి ప్రతిబింబించిన నా మోముపై
పల్చని ప్రసన్న పొర పొడిచింది
తెల్లని వెన్నెల నగవు పూసింది
కాలన్ని లెక్కిస్తూ మెదడు కదలకుండా నిలిచిపోయింది
అదుపులేని ఆలోచన అందకుండా సన్నగిల్లింది
మసకబారిన అయోమయం విడువకుండా ఆవరించింది
ఆటంకం లేని ఆహ్లాద సమయాన్ని నిద్రలో ముంచేసాను!
మిన్నంటి మిలమిల మిటకరిస్తూ నన్నలరించిన తార
చిట్టచివరి మిణుకు ఉషస్సులో కరిగిపోయింది

-


30 NOV 2020 AT 11:30

రోహిత్, కవి
కవిరాజభోజ, పవి
కవనవేదిక, దివి
పదగాంభీర్యం, భువి

(more in caption)

-


Fetching Chandra Mouli Quotes