QUOTES ON #వీణమెట్లు

#వీణమెట్లు quotes

Trending | Latest
14 FEB 2018 AT 1:11

జీవితం వందేళ్ల వరం కాదు,
బ్రతకలేని శాపమూ కాదు, అది
ప్రతి దినం ఇరవై నాలుగు గంటల పయనం.

ఇరవై నాలుగు వీణ మెట్లు, సప్త తంత్రులతో
వేల రాగాలు మీటినట్లు,
నీ ప్రతి ఇరవై నాలుగు గంటల్ని,
సప్త-ఇంద్రియాలతో నీకనుగుణంగా
మలుచుకుని స్వప్నాలని సాకారం చేసుకో....

-


13 FEB 2018 AT 21:45

వీణా మెట్లు ....
ఏ స్వరం నీ ఎద దోచేనో ....
రుద్ర వీణ చేత బూని ....
కుడి చేత తంత్రి మీటి ..
ఎడమ చేత మెట్టు అదిమి పట్టి....
పలికించిన స్వరాలలో
పులకించితివి వైణికా.....

జీవితంలో సైతం.....
కామ , క్రోధ ,అసూయాది
దుర్భుద్ధులను అదిమి పట్టి....
మానవతా,సహృదయ తదితరాది
సద్గుణాల తంత్రుల మీటి....
పలికించు మానస
..,. స్వరాలను మర్త్యుడా ...

-


14 FEB 2018 AT 17:52

వీణ మెట్లు ఎవరు మీటినా అది ఏ రాగం ఐనా ఒకేలా పలుకుతుంది, కమ్మని సంగీతాన్ని అందిస్తుంది....
జీవితం లో ఎక్కే గెలుపు మెట్లు ఎవరికి ఐనా
ఒక్కటే....
జీవితాన్ని చూసే దృక్పధం వేరే ఐనా అంతిమ లక్ష్యం ఆనందమే కదా..

-



ಜೀವನವು ನೂರು ಸಂವತ್ಸರಗಳ ವರವೇನಲ್ಲ,
ಬದುಕಲಾರದ ಶಾಪವೂ ಅಲ್ಲ,ಅದು
ಪ್ರತಿದಿನದ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಗಂಟೆಗಳ ಪಯಣ.

ವೀಣೆಯ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಮೆಟ್ಟಿಲುಗಳು,
ಸಪ್ತಸ್ವರಗಳೊಂದಿಗೆ ಸಾವಿರಾರು
ರಾಗಗಳ ಮೀಟಿದ ಹಾಗೆ,
ನಿಮ್ಮ ಪ್ರತಿ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಗಂಟೆಗಳಿಗೊಮ್ಮೆ,
ಸಪ್ತ-ಇಂದ್ರಿಯಗಳನ್ನು ನಿಮಗೆ ಅನುಗುಣವಾಗಿ
ನಿಮ್ಮ ಕನಸುಗಳನ್ನು ಅರ್ಥೈಸಿಕೊಂಡು ಅರಿತುಕೊಳ್ಳಿ...

-


14 FEB 2018 AT 20:37

వీణమెట్లతో సాగే ఆ స్వరం
సంగీతానికి ఒక వరం,
నీ జతకై వేచే నా జీవిత కథనం
నీకై అర్పించే ప్రేమను సర్వం !!

-


13 FEB 2018 AT 21:37

సరిగమపదని సనిదపమగరి
ఆ వీణ పలికే ఆరోహణ అవరోహణలు
మెట్లు ఎక్కి దిగవలసిందే
ఈ జీవిత వీణ సహితం మెట్లు
ఎక్కి దిగవలసిందే
వెలుతురు వెంట చీకటి రావాల్సిందే
ఆ రెండు కలిపి వీణ మెట్లు పలుకు తాయి రాగాలు
ఈ రెండు ఉంటేనే జీవితం రాగం పలికేది

-


14 FEB 2018 AT 0:36

నున్నని వీణపై సప్త స్వరాలు పలకాలంటే వీణ మెట్లు తోడు అవ్వలసిందే
నా జీవితం కొత్త మలుపూలు తీసుకోవాలంటే నీ నవ్వులు జత కావాల్సిందే

-