నను భరించే నీకు(మనసుకు),
ఎందుకంత గులాబీరేకంత సున్నితం
అనునిత్యం ఆకాంక్షల లహర్యలతో
ఉవ్విల్లూరే ఆత్రం నీ అంతరంగమైనా
ప్రతీక్షణం నిను తడుమునో విషాదం
వాణీ కృపాణ దాడితో గాయాలపాలై
నీ లాలిత్యం శిలాస్థితియంత కాఠిన్యానికి
రూపాంతరం చెందినా తుదకు పగుళ్ళు
సైతం పలకరించినా నీలోని ప్రేమమాధుర్యం
ప్రసూనం వలె పరిమళిస్తూనే ఉంటుంది
ఎలానే మనసా?
అసలు నీకెలా సాధ్యమే మనసా!
ఎంతటంకిలి నిను ఊపిరి
సలపనీయకున్నా
నీలో నీతో నీకెంతటి పోరితమైనా
తెవులును దాస్తూ మోదాన్నే పంచుట
నీకెలా సాధ్యమే మనసా!
కరములందు అదిమిపట్టలేని అవకాశాన్ని
దోషిని చేస్తూ రూపం లేని రేపటిలోనూ
నీకిదే వ్యధను దోచి దాచి పెడుతూ
చిత్రం చూస్తున్నా
నను వీడిపోవేమే మనసా!
నువు కూడా వెలితే నే నడి సంద్రాన
నావనైపోతానని నీకు తెలుసేమో బహుశా!
- నిను బాధించే నేను.
-
ఏ తీపి చేదు జ్ఞాపకాల కలబోతో బ్రతుకు
ఏ కన్నీటి సాగరాన ఏదురీతో బ్రతుకు
ఏవని ఉనికి ఎంతవరకో
ఎరుక ఈశ్వరునకు
నడుమ స్థితి గతుల మాయవలయమును చేదించుటకు
ఎవనికుంది సత్తువ ఈ జగమును శాశించుటకు
ఎవరికెవరు ఏమవుదురో ఎరుగుటకు
సాగుతుంది జీవన పయనం వానివాని గురుతులు ఇలన నిలుపుటకు
ఎవనిలో ఎంత తపనుందో తెలుపుటకు
వాని మనసులోని భాష్యమేమిటో గెలుపునకు
ఏముంది తక్షణ పరిష్కారము ఆన్ని బాధలకు
ఆత్మ సందర్శనమే అసలు జ్యోతి శాశ్వత వెలుగునకు.-
లేఖ
తన తనువు చాలద౦టు౦ది నీ మీద నా ప్రేమ తనపై కురిపి౦చుకోబడటానికి
అక్షరాలు
క౦గారుపడుతూ ముందుకి వెనక్కి నెట్టుకు౦టున్నాయి
ఈ అద్భుత ప్రేమకి ఎవ్వర౦ సరితూగుతామో అని
వర్ణపు సిరా
బి౦కాన్ని నేర్చుకు౦ది ఇ౦తటి భగ్నప్రేమ వ్యక్తీకరణకి తను చాలునా అన్న శ౦ఖతో తన వల్ల విరామభ౦గ౦ కలగొద్దని
నా మది మురిప౦తో ముచ్చటపడుతు౦ది
నా మూడు ప్రాణ౦లేని ప్రప౦చాన్ని మార్చే అతి మైత్రి సహచరాలు ఇ౦తలా తమని తాము అ౦కిత౦ చేసుకు౦టూ
నా భావానికి దృశ్యరూప౦తో పాటుగా శ్రవణస౦దడి చేస్తున్న౦దుకు.. నా ప్రేమవిస్తీర్ణ౦ పె౦చుతున్న౦దుకు....-
నా మదిలో సడిలా మారిన నీకు...
(పూర్తి "లేఖ" ఉపశీర్షికలో చదవగలరు👇)-
నేను ఈ లేఖను బరువైన హృదయంతో, గొప్ప ఆందోళనతో రాస్తున్నాను.. ఎందుకంటె నేను ఎన్నడూ అనుకోలేదు ఒక తల్లి పడే వేదనను అర్ధం చేసుకోలేని బిడ్డ ఉంటాడని, తన నిర్లక్ష్యంతో తన అమ్మ కడుపునే కొడతాడని. హహహ! ఇది కలికాలం కదా, ఆ సంగతే మరిచాను..
-
నా జీవితంలో వెలుగు నింపిన చీకటి రోజులు నీవే..
ఎన్నో సంవత్సరాల ఎదురుచూపులకు ముగింపు నిచ్చావు..
దాదాపు వెయ్యి కిలోమీటర్ల పరిగెత్తి వుంటా..
చెమట చిందని రోజు లేదు..
నా రక్తం రుచి నా కన్నా నేలకే బాగా తెలుసు..
ప్రాణనికీ పోరాటం నేర్పావు..
మౌనానికి గర్జన నేర్పావు..
బానిసత్వంలో బాధను...
జీవితాంతం మాననీ గాయాలను..
జీవితాంతం వెంటాడే జ్ఞాపకాలునూ..
నిదుర లేని ఎన్నో రాత్రుళ్ళును..
నిస్సహాయతతో వేళ్లదీసిన ఎన్నో రోజులను..
పరిచయం చేశావు..
నువ్వుంటే కోపం, కానీ కర్తవ్యం నేర్పావు..
నువ్వుంటే బాధ, కానీ బాధ్యత నేర్పావు..
నువ్వుంటే భయం, కానీ అభయం ఇచ్చావు..
నేను గతించే వరకు నీతో గమనం గుర్తు వుంటుంది..
కృతజ్ఞతతో..-
ఓ నా ప్రియ భారత దేశమా!!!!
ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని అలుపు ఎరుగని నీ ధైర్యానికి,తేజస్సుకి సలామ్!!!
నీ ఖ్యాతిని లోకమంతా చాటి చెప్పాలని
ఉంది..
కాని ఎంత కాలం అభివృద్ధి చెందుతున్న జాబితాలో ఉంటావు?
నీ ఐక్యతని విచ్చినం చేస్తూ నీ గోప్పతన్నాని అవహేళన చేస్తున్నా శక్తులు పేదరికం, నిరుద్యోగం,స్త్రీల పట్ల అహింస,బాల్యకార్మిక,
అవినీతి,దుర్నీతి,లంచం,వివక్ష వంటి వాటి నుండి బయట పడాలని కోరుతూ..
ఎన్నో సవాలు భరించి వచ్చిన నీవు ఇవి కూడా తెగించి ముందడుగు వేయాలని నిన్ను మేలుకోలుపుతూ..
ఈ చిన్న లేఖ నా దేశానికి అంకితం చేస్తూ..-