నీ తలపు నన్ను వీడదంట
వాసంతపు కుసుమంలా
మనసు మేను కలిసెనంట
శరదృతువు చంద్రంలా
వలపువీణ మీటెనంట
హేమంతపు హిమములా
మోము సిగ్గు విడువదంట
శ్రావణపు తొలకరిలా
తాపమేమొ తరగదంట
గ్రీష్మభాను వీక్షణలా
వలపుహొయలు కరిగెనంట
మృత్తికొడిన శిశిరంలా-
27 DEC 2020 AT 9:27
10 DEC 2018 AT 22:16
తన మనసే విరిసిన వాసంతం
తన కోపమే వేడెక్కిన గ్రీష్మం
తన ప్రేమే కురిసే వర్షం
తన చిరునవ్వే హేమంతం
తన నగుమోమే శరద్(శరదృతు)
తన బాధే మోడువారిన శిశిరం
ఆరు రుతువుల సంగమం
కలింగించే నాకు సమ్మోహనం-
1 MAR 2018 AT 19:52
పండుబారిన ఆకులేమో కొమ్మనొదిలి మట్టిని ముద్దులాడె, శిశిర వైఖరి తెలిసి కొమ్మ కొమ్మ వసంతంకై ఎదురుచూసె, చిగురు చిగురులో లేత పూఁబిందెల తావి గ్రీష్మ తాలూకు ఆచూకీ తెలిపే, పొంగు పొంగున తరలి వర్షము వేర్లు కడిగి పంకపు పారాణి పూసె, వాన వెలిసిన అలుపు ఒడిలో శరత్కాంతులు లాలించె, సుతిమెత్తగా హేమంత హిమము అహ్లాద ఊయలలూపె.
-