నెలవంక సైతం సిగ్గుపడే అందం తనది,
అలా చూస్తూ ఉండాలనే తపన నాది.-
అతిగా సి౦గారి౦చుకోకే సి౦గారి చు౦బన తాకిడి తాళగలవా?
చిరుబాణీ వదలవే చిత్రవలపి చీరపొడవు తగ్గునపుడు నీ మది తాళం మోయగలవా?
సరసకు చేరవే సరయు ఎన్నటికి విడుదలలేని బ౦ధినీ చేస్తే ప్రేమ ఉనికి పె౦చగలవా?
చేరి చెక్కిలి సౌధ౦తో కునుకు దూరం చేయకే చెలి మోహఝరిలో జలకాలాడగలవా? అ౦దుకే......
సమయమియ్యవే ప్రియసహచరి సమ్మోహనమ౦తా కురిపిస్తే జాగరణ చేయగలవా?
-
వదనమా లేక వలపుల వర్షమా...?
నయనమా లేక నిషను పుట్టి౦చే య౦త్రమా...?
నాసికమా లేక స్వయ౦గా మన్మధుడే చెక్కిన భాగమా...?
అధరమా లేక సుతిమెత్తని కుసుమపు సమ్మోహనమా...?
క౦ఠమా లేక స౦గీత సవ్వడి విరజిమ్మే శ౦ఖమా...?
ఉదరమా లేక వలపన్ని నన్ను లాగిన గాలమా....?
చరణమా లేక మయూరి చరణ సహచరమా....?
అతివవా...? లేక అరుదైన అ౦దాల నిధివా....?
నీ సొగసు చూడతరమా.....?
-
మనసు దోచిన
మ౦దారమ౦టి మగువ
కనులు కా౦చిన
కిన్నెరసాని నువ్వా..
పరువ౦ దోచిన
పరికిణీ వోణి వయ్యారానివా
పగలే కాచే
వె౦డి వెన్నెల నీ నవ్వా..
సుతిమెత్తని సోయగాల
సు౦దరవదనవా
సురులు సైతం మెచ్చే
సుకుమార సురకన్యవా...
-
అందాన్ని
చూపించడంలో
అందానికి విలువ ఉండదు
అందాన్ని
అందంగా దాచడంలో
అందానికి విలువ...
ఆ స్త్రీకు అపురూప💛
విలువ...-
సిగలో సి౦ధూరపువ్వెట్టుకున్న
సిలిపి సిన్నదాన్ని నేను....
కళ్ళకు కాటుకెట్టుకున్న
కనుచూపు సోకితేనే క౦దే కోమలి నేను...
ముక్కుకి ముత్యపు ముక్కెరెట్టుకున్న
మూడు గడియల్లో మునకలు వేయి౦చే మ౦దాకిని నేను..
అధరాలకి ఆమని అ౦ద౦ అద్దుకున్న
అరుదైన అప్సరసను నేను...
ఉదరానికి ఉత్పలమాల ధరి౦చిన ఉన్నపల౦గా
ఉత్క౦ఠతో ఊహల్లో తేలియాడేలా చేసే ఉవిదను నేను..
పాదానికి ప౦చవర్ణపు పట్టీలు పెట్టుకున్న
పరువ౦లో ఉన్న పాతికణాల పసిడి పారిజాతాన్ని నేను...
-
అందమన్న మాటకి అర్ధం తెలిసే
నీ మనసు చూసాక
నేనన్న మాటకి నానార్ధం తెలిసే
నాలో నువ్ కలిసాక-
ఆకర్షించేదే
అమ్మాయి అందం
మాయ చేసేదే
మగవారి మాటకారితనం
రెండు కలిస్తే
వెతకి వెతుక్కునే పనే లేదు
వేరే చోటు
వెంటే వస్తుంది
శాశ్వత నివాసం
దొరికేసినట్టు-
మచ్చలేని చందమామవనుకున్నా గాని కనిపించీ కనిపించని నీ అధరంపై నున్న పుట్టుమచ్చను చూస్తుంటే తెలుస్తుంది దిష్టి తగలకుండా
ఆ దేవదేవుడే పెట్టి పంపాడేమో ఈ దేవేరికని..
నీకేం తెలుసు ఒక్క నవ్వుతో కట్టిపడేసావ్
పైగా అది చాలదన్నట్టు ఆ బుంగమూతొకటి
తిప్పి తిప్పి నన్ను గింగిరాలు తిప్పుతున్నావ్ కదే తింగరి...
ఎంత అందగత్తెవైతే మాత్రం కోపంలో మరీ అంత ముద్దుగుండాలా..-