QUOTES ON #హైకూలు

#హైకూలు quotes

Trending | Latest

ఆ నయనాలే
విరజాజి మొగ్గలై
వికసించెనా... !

-



అమ్మ ప్రేమకు
తానిచ్చిన జన్మకు
వెలకట్టకు !

-



కెరట హోరు
ప్రణవ నాదమై నీ
హృది చేరెనా...

-


9 JUL 2020 AT 9:44

నీ నిశ్శబ్దము
నీలి సంద్రమయిందా
నా కనులలో

-


7 JUL 2020 AT 15:31

గాలి ఖొరియోగ్రఫీలో
చెట్లు వయ్యారంగా
నాట్యం చేస్తున్నాయి

-



వైక్యూ వనాన
సుగంధ 'చందనము '
తానెల్లప్పుడు...

-


7 JUL 2020 AT 16:02

వర్షం ఆగింది
పాపం గొడుగు,మూతి
ముడుచుకుంది

-


25 MAY 2020 AT 16:17




చెక్కిళ్ళపైన
జారిన మల్లెపూవా
నీ చిరునవ్వు!

ఏకాంతమున
పూయు చేమంతి పూవా
నీ వాలు చూపు!

సుమనప్రణవ్




-


25 MAY 2020 AT 20:51

మది ట్విట్టర్లో
బోలెడు ట్వీట్లున్నాయి
అన్నీ మూగవే

-


13 SEP 2020 AT 10:23

కరెంట్ తీగలు
రవికి గిటారుగా
వేకువ గానం

-