Shiva Krishna Ksk  
775 Followers · 336 Following

read more
Joined 6 August 2018


read more
Joined 6 August 2018
28 APR AT 21:01

తను ఉదయపు ఆకాశమంత స్వచ్ఛంగా నవ్వుతుంది
వెలసిపోయిన తారలన్నీ మళ్ళీ మెరిసేంతలా

-


28 APR AT 19:00

ఉదయ కాంతిలో పువ్వులు అన్నీ విచ్చుకోవడం నేనే చూసా
పరిమళాలలో ప్రభాత గీతం ఆలపించడం నేనే చూసా

పున్నమి రోజున సంద్రం పైనే నిండు జాబిలిని చూచుట ఇష్టం
సిరి వెన్నెలలే తరంగాలలో నాట్యమాడడం నేనే చూసా

చల్లని గాలులు తాకిన వెళల ముబ్బల కొమ్మకు చినుకులు పూసెను
నేలకు చేరిన చినుకుల పూలే పరిమళించడం నేనే చూసా

వింతలు అన్నీ కనుల ముందరే జరిగిపోవడం ఎంతో భాగ్యం
గొంగళి పురుగే సీతాకోకై ఎగిరిపోవడం నేనే చూసా

పున్నమి రోజున కురిసిన వర్షం ఆకులపైనే ముత్యాలైనవి
ప్రతీ బొట్టులో చందమామలే వెలిగిపోవడం నేనే చూసా

-


28 APR AT 8:07

నిన్నెవరూ తక్కువ అంచనా వేయలేరు
అది నీకు నువ్వు చేసుకునే పని మాత్రమే

-


27 APR AT 23:56

రెండు మనసుల తీరాలు కలవాలంటే
వారి మధ్య ప్రవహించే అహం నది ఆవిరవ్వాలి

-


27 APR AT 23:32

నువు కూడా ఓ అణువు లోంచి తయారు చేయబడ్డ విశ్వానివే..
సమస్త విశ్వానికి ఉన్న శక్తి నీలోనూ ఉంది

-


27 APR AT 22:34

జ్ఞానం ఎపుడూ ఊహల్లోంచి, ప్రశ్నల్లోంచి
ప్రయోగాల్లోంచే వస్తుంది...
నమ్మకాలు కేవలం బ్రతకటం నేర్పతుంది
జ్ఞానం ఉత్తమంగా ఎలా బ్రతకాలో నేర్పుతుంది

-


27 APR AT 17:32

నీ వాదన సరిగా లేకుంటే
నీ నిజం కూడా అబద్ధంలా అనిపిస్తుంది

-


3 MAR AT 10:36

సముద్రం
కఠోర తపస్సు చేస్తుంది
అలల హోరు
జపంలా వినిపిస్తుంది

-


3 MAR AT 10:30

చిన్న అలజడికి
చెరువు మేల్కొంది
అలల ఆవలింతలు
తీస్తూ

-


28 FEB AT 9:21

ప్రియురాలు నా పేరు పిలవడం బాగుంది
కొంటెగా ఓ చూపు విసరడం బాగుంది

గలగలా నవ్వుతూ మాటలే చెబుతోంది
నా పైన వెన్నెలలు కురవడం బాగుంది

వేలితో తన కురులు సవరించుకుంటోంది
మైమరచి తన సొగసు చూడడం బాగుంది

తన వలన ఎద సడులు పెరుగుతూ ఉన్నాయి
గుండెలో వేడుకలు జరగడం బాగుంది

తొలి చూపు ప్రేమలో నమ్మకం కలిగింది
వింతైన ఈ హాయి పొందడం బాగుంది

-


Fetching Shiva Krishna Ksk Quotes