రోజు రోజుకూ ఎటు వెళుతోందీ లోకం
జీవితాల్ని చిదిమేసి మిగిల్చింది శోకం
మనసంటూ లేనే లేని కసాయి
చంపేందుకు ఇచ్చాడు కిరాయి
ప్రాణాలను తీయుటకు కారణం పరువు
జాలి, దయ, కరుణలకు వచ్చింది కరువు
కడతేర్చుటకు కారణం ఓ పదవి
మనసులో మాటలు దాటవులే పెదవి
జరుగుతున్న దారుణాలు చూస్తున్నా కళ్ళు
ముందడుగేసి కాపాడేందుకు కదలట్లేదు కాళ్ళు
హత్య చేసి హంతకులు సెకనులో పరారి
ఊపిరిని గాలిలో కలిపేసింది సుపారిీ-
నేటి నా భారతావని
మందార వర్ణ సింధూరాన్ని
స్వేధన భాష్పాలతో తుడుచుకున్న
అజ్ఞాతపు శ్రామిక భారతి...-
ప్రేమతో వచ్చాను నీ చెంతకు
ప్రాణమై ఉంటాను ప్రతి జన్మకు
మౌనమై గుచ్చోద్దు నా మనసును
మాటవై అల్లుకో ఈ వనితను
ఎంతకీ చేరవు నా చెంతకు
వింతగా నవ్వేను విధిరాతలు --ప్రేమతో --
సాగరాల మధనం
నా మనసులోన జరిగి
విషమ్ము చిమ్ముతుంది
ప్రతిక్షణం నా పైకి -- ప్రేమతో --
స్వప్నాల దారివెంట
సాగుతుంది పయనం
క్షణాలు అన్ని కలిసి
యుగాలుగా మారి
యుద్దాలు చేసే నాతో --ప్రేమతో ---
విషాద ఛాయలన్ని
నా మోహాన ఆవహించే
వినిపించ రావా నేస్తం
నీ గుండెలోని భావం --ప్రేమతో ----
కాస్తంత పదిలం నేస్తమా!
సీసా వంటిది మనసు
మాటతో ముక్కలు చేస్తే
తిరిగి నీవు అతక లేవు!
జరంత జాగ్రత్త స్నేహ సంద్రమా!
సీసా వంటిది జీవితం
ఒంపేసిన క్షణాన్ని
నీవు తిరిగి నింపలేవు!
కూసంత భద్రం మిత్రమా!
సీసా వంటిది జీవనం
వంటబట్టిన సారం మంచో చెడో
అది ప్రపంచానికి దాచి ఉంచలేవు!
సుమనప్రణవ్-
ప్రతి పొద్దుకి ప్రశ్నిస్తున్నా
తను తోడున్న క్షణాలిమ్మని.
కాలానికి గాలాలు వేస్తున్నా
ఆలాపనల రాగాలు వినమని.
అనుక్షణం ప్రణవనాదాన్ని మీటుతున్న
నిరీక్షణల నిడివి తగ్గించమని
నీరాజనమై తనకు కవ్వించమని...
-
#ప్రహేళిక #నాభారతావని లో పాల్గొన్న ప్రతీ
ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ
Roopa rani గారిని తదుపరి ప్రహేళిక ఇవ్వవలసింది గా
కోరుకుంటున్నాను.. 🙏🏼
-