QUOTES ON #ఇదే

#ఇదే quotes

Trending | Latest

మారుతున్న భారతం
ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం కిలో 2/-
వాటిని తీసుకెళ్లడానికి వచ్చే బండి
విలువ బియ్యం ధర కన్నా కొన్నే వేల రేట్లు,
2/-రేషన్ బియ్యాన్ని 500 అమ్ముతాం
కిరాణా షాపులో...

-


8 OCT 2019 AT 10:08

💕 అనామికా ...

నీ రూపెక్కడ
చూపెక్కడ ...
నీ రాశెక్కడ
వాసెక్కడ ...
నీ ఊసెక్కడ
ఊపిరి కాపెక్కడ ...
నీ మనసెక్కడ
మానసమెక్కడ ...
నీ మది ఎక్కడ
యద ఊసులెక్కడ ...
నీ గుండె గూడెక్కడ
గుస గుస సవ్వడులెక్కడ ...
నువు లేని దశమైనా
నాకు అష్టమే
అ చూపులు సోకని ఉదయం
నాకు కష్టమే
నీ రూపం నాకిష్టమే ఇది స్పష్టమే ...
... ✍ "కృష్ణ" కలం

-


22 SEP 2019 AT 12:35

గొప్పలు చెప్పటం
నాకు
అలవాటు లేదు ...
గాలిని
పైకి ఎత్తడం
శూన్యాన్ని మెచ్చి
చప్పట్లు కొట్టడం
నాకు చేతకాదు ...
మనసు చంపుకొని
మాట్లాటడం
నాకు అస్సలు రాదు ...
కుండయినా
బద్దలు కొడతాను
లేదా కిమ్మనకుండా
కూర్చుంటాను ...
నచ్చితే
నాతో ఉండు
నచ్చకుంటే
దూరంగా ఉండు ...

... ✍ "కృష్ణ" కలం

-


24 NOV 2019 AT 16:27

అతడిని చూసి ఓర్వలేక
చుట్టూవున్న లోకం ఏడుస్తుంటే
వాళ్ళ ఏడుపుని అతడు పాటగా
మార్చుకుని వింటూ నవ్వుతున్నాడు

-