ఆకుపచ్చని చీర సింగారించినట్లు వరిపొలాలు
పచ్చని పైరులే రైతన్నకు పసిడి సిరులు
-
నిండు గర్భిణి అవనమ్మ
వరిచేను భారంగా వదిగేనమ్మ
కర్షకునిమనసు హర్షం నొద్దేనమ్మ
వరి సిరులు కురిసెనమ్మ-
నెర్రబాసిన నేల నింగిని వేడేను
సుట్టపు సూపుకైనా వానమ్మని చూసి పొమ్మనే
చినుకుతో పలకరించమనే ఎండిపోయిన పైరుని
-
పైరుకు పట్టినట్టి
పురుగు చేదనేను
రైతు ప్రాణమంటనే
నాకు తీపెక్కువనెను-
మృగశిర కార్తె మొదలయ్యే
గొంతు ఎండిన నేలకు దప్పిక తీర్చగా వచ్చే
ఎండిపోయిన గడ్డిపరకలో పచ్చదనంతో పురుడోసే
పచ్చని పసిరికపై రాలిన చినుకు ముత్యమల్లే మెరిసే
సెలకల్లో నాగలి ఇరువాలు దున్నగా ఎద్దుతో సోపతి చేసే
జగతి ఆకలి తీర్చగా రైతన్నకు పంట పండించే కొలువు కుదిరే-
పైరు వీచె గాలులు...
పసిడి పచ్చని పంటలు...
సెలయేటి సవ్వడులు...
పక్షుల కిల కిల రాగాలు...
నెలవంక లాంటి ఒంపుసొంపులు...
ఇవే మా పల్లెటూరి అందాలు...
అందరినీ అలరించే వర్ణాలు...-
నింగిలోని తెల్లని మేఘము
తెలుపు తెరలను తీసుకొనేను
నవ్వుతూ దువ్వగా మీసము
నలుపవగా తానే కరిగెను
ఎడతెరిపి లేని వానతోని
విరుచుకుపడితివి ఉరుములతో
పైరులు మునిగేను నీళ్లతోని
వరుణ దేవ కరుణించు దయతో
-
నీళ్లాడ సిద్ధమయ్యే నిండుశూలాల వరిసేను
పాలోసిన కంకులతో పరువాలొలొకే వరిగొలుసులు
పైరు కాపుతో పొంగి పుట్లకొద్ది ధాన్యపు సిరులను కురిపించే-